Video: టర్కీలో ట్రక్కు బీభత్సం.. జనాల పైకి దూసుకెళ్లడంతో 20 మంది మృతి...

Turkey Mardin Road Accident: టర్కీలో ఒకేరోజు రెండు చోట్ల ఒకే తరహాలో రెండు ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 22, 2022, 03:30 PM IST
  • టర్కీలో ఘోర రోడ్డు ప్రమాదం
  • మార్దిన్‌లో ట్రక్కు బీభత్సం
  • 20 మంది మృతి 26 మందికి గాయాలు
Video: టర్కీలో ట్రక్కు బీభత్సం.. జనాల పైకి దూసుకెళ్లడంతో 20 మంది మృతి...

Turkey Mardin Road Accident: టర్కీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అప్పటికే ఓ రోడ్డు ప్రమాదం జరిగి జనమంతా గుమిగూడిన చోట మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్కు అక్కడ గుమిగూడిన జనాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా మరో 26 మంది గాయపడ్డారు. టర్కీలోని మార్దిన్‌ ప్రావిన్స్‌లో ఉన్నడెరిక్ ప్రాంతంలో గత శనివారం (ఆగస్టు 20) ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

స్థానిక మీడియా కథనం ప్రకారం... డెరిక్‌లోని ఓ ప్రదేశంలో శనివారం ఉదయం మొదట ఓ కారు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులు, హెల్త్ వర్కర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న జనం చుట్టూ గుమిగూడారు. ఇంతలో రోడ్డపై అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన గుమిగూడిన జనాల పైకి దూసుకెళ్లింది. 

ట్రక్కు బీభత్సానికి 20 మంది బలయ్యారు. గాయపడ్డ 26 మందిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కు బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలు రికార్డయ్యాయి. తన జీవితంలో ఎన్నడూ ఇంత ఘోర ప్రమాదం చూడలేదని.. ప్రమాదంలో గాయపడ్డ 53 ఏళ్ల సాదిక్ అరి నే వ్యక్తి వాపోయాడు.

కాగా, అదే రోజు టర్కీలోని మరో గజియంటెప్ అనే మరో ప్రాంతంలోనూ ఇదే తరహా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొదట ఓ వాహనం  ప్రమాదానికి గురవగా.. అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నవారి పైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మృతి చెందారు. ఒకే రోజు ఒకే తరహాలో రెండు ఘోర ప్రమాదాలు చోటు చేసుకోవడం టర్కీని ఉలిక్కిపడేలా చేసింది. 

Also Read: Mlc Kavitha: కేసీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర.. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత

Also Read: Delhi Liqour Scam: బీజేపీలో చేరితే  సీబీఐ, ఈడీ కేసులు ఎత్తేస్తామని ఆఫర్.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News