Travel Curbs: భారత్‌పై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా..నవంబర్ 8 నుంచి అమల్లోకి..!

USA: భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను తొలగిస్తూ..శ్వేతసౌదం ఆదేశాలు జారీ చేసింది. ఇది నవంబర్ 8 నుంచి అమల్లోకి రానుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 02:13 PM IST
  • అమెరికా కీలక నిర్ణయం
  • భారత్‌పై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అగ్రరాజ్యం
  • నవంబర్ 8 నుంచి అమలు
Travel Curbs: భారత్‌పై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా..నవంబర్ 8 నుంచి అమల్లోకి..!

US Lifts Travel Curbs On India: భారత్‌ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ అగ్రరాజ్యం అమెరికా(America) ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే కొన్ని కొత్త రూల్స్(New Rules) అమల్లోకి తెచ్చింది. తాజా నిర్ణయం నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి ప్రారంభం కావడంతో అమెరికా మొదటిసారి విదేశీ ప్రయాణాల(Overseas travel)పై ఆంక్షలు విధించింది. 

Also Read: China Puts City On Lockdown: కరోనా ధాటికి చైనాలో మరోసారి లాక్​డౌన్​

‘'అమెరికా ప్రయోజనాల దృష్ట్యా కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షల్ని తొలగిస్తున్నాం. టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం'’ అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden) వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ నుంచి ఇచ్చినటువంటి మినహాయింపునే 18 ఏళ్ల లోపు పిల్లలకూ ఇచ్చింది. వ్యాక్సినేషన్(Vaccination) రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వారు అమెరికాకు వచ్చిన 60 రోజుల్లోపు టీకా పొందాల్సి ఉందని చెప్పింది. ప్రయాణం ప్రారంభమైన 72 గంటల్లోపు చేయించుకొన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్‌ రిపోర్టును సమర్పించాలి.

Also Read: China vs America: అమెరికా ఆధిపత్యం ఇకపై చెల్లదంటున్న చైనా, అసలేం జరిగింది

పలు దేశాలపై పరిమితుల తొలగింపు గురించి సెప్టెంబర్‌లోనే శ్వేతసౌధం ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ గురించి విమానయాన సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను వెలువరించింది. పరిమితులు ఎత్తివేసిన వేళ.. సీడీసీ కాంటాక్ట్ ట్రేసింగ్(CDC Contact Tracing) సంబంధించి విమానయాన సంస్థలకు నిబంధనలు జారీచేసింది. ప్రయాణికుల నుంచి తగిన సమాచారం సేకరించాలని స్పష్టం చేసింది. అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం పొందిన టీకా తీసుకున్న వారు తమ దేశంలో ప్రయాణించేలా సీడీసీ గతంలోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. మిక్స్‌డ్‌ డోసులు విషయంలో కూడా వెసులుబాటు ఇచ్చింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News