చంబ్రాబాబుతో వాణి విశ్వనాథ్ భేటీ

Last Updated : Nov 9, 2017, 05:25 PM IST
చంబ్రాబాబుతో వాణి విశ్వనాథ్ భేటీ

90లలో సినిమాల్లో నటించి సతెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు మళయాళ నటి వాణి విశ్వనాథ్. ఆతరువాత సినిమాలకు దూరమయ్యారు. మొన్నీమధ్యనే  మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉందని వాణి మీడియాకు చెప్పారు.  అయితే ఏపీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో క్లారిటీ ఇవ్వలేదు.   అయితే  మీడియా, దినపత్రికల్లో టీడీపీలో చేరుతారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆమె నిన్నటివరకూ ఏ పార్టీలో చేరుతాననే మాట స్పష్టంగా చెప్పలేదు.  

ఇది ఇలా ఉండగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో వాణి విశ్వనాథ్ బుధవారం భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తాను సిద్దంగా ఉన్నానని వాణి విశ్వనాథ్ చంద్రబాబునాయుడుతో చెప్పబోతున్నారని సమాచారం. టీడీపీ కూడా మహిళా నేత పార్టీకి అవసరమని నమ్ముతోంది. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పోటీగా వాణి విశ్వనాథ్ ఉంటే బాగుంటుందని టీడీపీ ఆలోచిస్తోంది. అందులో భాగంగా నేడు చంద్రబాబునాయుడుతో వాణి విశ్వనాథ్ భేటీకానున్నారు.

Trending News