చంద్రబాబు దూతగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్: అంబటి రాంబాబు

చంద్రబాబు దూతగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్: అంబటి రాంబాబు

Updated: Nov 15, 2019, 06:40 PM IST
చంద్రబాబు దూతగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్: అంబటి రాంబాబు

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబే తన దూతగా పంపించి ఉంటాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సందేహం వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ర్ట ప్రయోజనాల కోసం వెళ్లాడని తాను భావించడంలేదన్న అంబటి రాంబాబు.. ఢిల్లీ వెళ్లివచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడనేది ఆయనే చెబుతాడని ఆశిస్తున్నానని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటున్న పవన్ కల్యాణ్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్న అంబటి.. జగన్ గారు 16 నెలలు జైలులో ఉన్నారంటూ మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా లేక పాలసీలపై మాట్లాడటం అనిపించుకుంటుందా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌పైనా తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కిన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను విమర్శిస్తున్న మీకు ఎక్కడనుంచి ప్యాకేజిలు వస్తున్నాయని ప్రశ్నించారు. పలుగు, పారలు కెమెరాలకు కనబడేలా చేయాలని దీక్షలో కూర్చున్నవారికి డైరెక్షన్స్ ఇచ్చిన చంద్రబాబు.. బొచ్చా, పార పట్టుకున్న వారినే కాకుండా పవన్ కల్యాణ్‌తోనూ బాగా నటింపచేస్తున్నారని ఎద్దేవా చేశారు.