AP Weather Report: మహారాష్ట్ర విదర్బ ప్రాంతం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో వాతావరణంలో మార్పు వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో పిడుగులు పడనుండగా మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయి.
ఏపీలో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు వర్షాలు, మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. వాతావరణంలో పొడి ఉండటంతో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాయలసీమలో తిరుపతి జిల్లా రేణిగుంట, అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో అత్యదికంగా 40.6 డిగ్రీలు నమోదైంది. కడప జిల్ల సిద్ధవటంలో 40.3 డిగ్రీలు నమోదైంది. ఇక విజయనగరం జిల్లాలో 12, పార్వతీపురం మన్యం జిల్లాలో 10, శ్రీకాకుళం జిల్లాలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి.
వర్షపాతం వివరాలు
అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి. నిన్న కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో 43.5 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 34, ప్రత్తిపాడులో 33, అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో 30 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
Also read: Pithapuram: పిఠాపురంలో భారీగా 86 శాతం పోలింగ్, ఎవరికి అనుకూలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook