ఏపీలో కొత్తగా మరో 75 క‌రోనా కేసులు

ఏపీలో గ‌త 24 గంట‌ల్లో కొత్తగా మరో 75 కరోనావైరస్ పాజిటివ్ కేసులు న‌మోదైనట్టుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల మ‌ధ్య 3,775 శాంపిల్స్‌ని పరీక్షలు చేయగా.. అందులో 75 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.

Last Updated : Apr 21, 2020, 06:06 AM IST
ఏపీలో కొత్తగా మరో 75 క‌రోనా కేసులు

అమరావతి: ఏపీలో గ‌త 24 గంట‌ల్లో కొత్తగా మరో 75 కరోనావైరస్ పాజిటివ్ కేసులు న‌మోదైనట్టుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల మ‌ధ్య 3,775 శాంపిల్స్‌ని పరీక్షలు చేయగా.. అందులో 75 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరింది. అనంత‌పురం, క‌ర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి జిల్లాకు ఒకరు చొప్పున మొత్తం ముగ్గురు మ‌ర‌ణించార‌ు. దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాడు గుంటూరు జిల్లాలో 15 మంది, కృష్ణా జిల్లాలో 10 మంది, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఇద్ద‌రు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ు. ఇప్పటివరకు 92 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్ర‌స్తుతం 610 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read also: తెలంగాణలో కరోనా కాటుకు మరో ఇద్దరు మృతి

జిల్లాల వారీగా కరోనా కేసులు:
ఏపీలో జిల్లాల వారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు విషయానికొస్తే.. అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 149, కృష్ణా జిల్లాలో 80, నెల్లూరులో 67, చిత్తూరులో 53, ప్ర‌కాశం జిల్లాలో 44 మందికి క‌రోనా సోకినట్టు సర్కార్ గుర్తించింది. అలాగే క‌డ‌ప జిల్లాలో 40, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 35, అనంత‌పురం జిల్లాలో 33, తూర్పు గోదావ‌రి జిల్లాలో 26, విశాఖ‌ప‌ట్నంలో 21 క‌రోనా కేసులు న‌మోద‌ు కాగా అదృష్టవశాత్తుగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్క క‌రోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News