పొరపాటున ఏప్రిల్ 9న ఓటేయాలన్న లోకేష్ ..సోషల్ మీడియాలో లీక్ చేసిన వైసీపీ

                       

Last Updated : Mar 21, 2019, 04:18 PM IST
పొరపాటున ఏప్రిల్ 9న ఓటేయాలన్న లోకేష్ ..సోషల్ మీడియాలో లీక్ చేసిన వైసీపీ

మంగళరిగి అభ్యర్ధిగా బరిలో ఉన్న నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో మరోసారి నోరు జారారు. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఏప్రిల్ 9న ఓటేయాలని ఓ బహిరంగ సభలో జనాలకు విజ్ఞప్తి చేశారు.

లోకేష్ నుంచి పొరపాటు దొర్లిన ఈ కామెంట్స్ సంబంధించిన వీడియోను వైసీపీ మద్దతుదారులు  సోషల్ మీడియాలో లీక్ చేశారు. లోకేష్ కు ప్రత్యర్ధిగా వైసీపీ మంగళగిరి అభ్యర్ధిగా బరిలో ఉన్న ఆళ్ల రామిరెడ్డి కృష్ణారెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి వెటకారంగా కామెంట్ చేశారు. 

‘నారా లోకేశ్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న టీడీపీకి ఓటు వేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటువేయండి. #VoteForFan #TDPLosing’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోను జతచేశారు. ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజర్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. 

 <

>

Trending News