AP: ఆలయ అపశృతులపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు

ఏపీలో గత కొద్దికాలంగా జరుగుతున్న అపశృతులతో ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతోంది. నష్ట నివారణ చర్యల కోసం సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Last Updated : Sep 21, 2020, 01:21 PM IST
AP: ఆలయ అపశృతులపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు

ఏపీ ( Ap ) లో గత కొద్దికాలంగా జరుగుతున్న అపశృతులతో ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతోంది. నష్ట నివారణ చర్యల కోసం సీఎం జగన్  ( Cm ys jagan ) కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది ఆలయ రథం ( Antarvedi temple chariot burnt ) దగ్దమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ( CBI Enquiry in Antarvedi incident ) కు అప్పగించింది. అంతర్వేది సంఘటన మొదలుకుని...రాష్ట్రంలోని పలు ఆలయాల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి. దాంతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి ( Ycp government ) కాస్త ఇబ్బంది ఎదురైందనే చెప్పాలి. ఇప్పుడు ఈ ఇబ్బందుల్ని ఎదుర్కొని..నష్టనివారణ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ విషయమై మంత్రివర్గంతో ( Cabinet ) సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే దగ్దమైన అంతర్వేది ఆలయ రథం స్థానంలో 95 లక్షలతో ఏడంతుస్థుల కొత్త రథం ( New Chariot ) నిర్మాణ పనుల్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా పుష్కరాల ( krishna pushkarams ) సందర్భంగా విజయవాడ సహా నదీ తీరం వెంబడి కొన్ని ఆలయాల్ని అప్పటి ప్రభుత్వం కూల్చివేసింది. ఇప్పుడు అవే ఆలయాన్ని అదే ప్రాంతంలో మళ్లీ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికోసం స్థలం ముహూర్తం చూడాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం. గోదావరి పుష్కరాల ( Godavari pushkarams ) సమయంలో తొలగించిన ఆలయాల్ని కూడా అదే స్థానంలో నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. 

మరోవైపు దేవాలయాల్నిగానీ...ప్రాంగణాలను గానీ ధ్వంసం చేసినట్టు ఎవరిపైనైనా ఆధారాలు లభిస్తే, కఠిన చర్యలకు వెనుకాడవద్దని కూడా జగన్ సూచించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. కృష్ణానది పుష్కరాల సమయంలో విజయవాడలోని దుర్గా ఘాట్,  భవానీ ఘాట్ ల వద్ద ఉన్న చిన్న చిన్న ఆలయాలను తొలగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయమై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే, ప్రజలు, భక్తుల సౌకర్యార్థమే ఆలయాలు తొలగిస్తున్నామని, వాటిని మరో ప్రాంతంలో తిరిగి నిర్మిస్తామని నాటి చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చినా..కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. నిందితులపై కఠినంగా వ్యవహరిస్తూనే..ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. Also read: Tirumala Declaration: ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Trending News