Ys jagan and Pm Modi: ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం, చర్చించిన అంశాలివే

Ys jagan and Pm Modi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన వైఎస్ జగన్..వినతి పత్రాన్ని అందించారు. ప్రధాని మోదీతో..వైఎస్ జగన్ చర్చించిన అంశాలివే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2022, 08:25 PM IST
Ys jagan and Pm Modi: ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం, చర్చించిన అంశాలివే

Ys jagan and Pm Modi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన వైఎస్ జగన్..వినతి పత్రాన్ని అందించారు. ప్రధాని మోదీతో..వైఎస్ జగన్ చర్చించిన అంశాలివే..

దాదాపు 45 నిమిషాలసేపు సాగిన సమావేశంలో..ముఖ్యమంత్రి వైఎస్ జగన్..రెవిన్యూలోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసికి గనులు కేటాయింపు, మెడికల్‌ కాలేజీల అనుమతి వంటి కీలకమైన అంశాలపై చర్చించారు.  

ప్రధాని మోదీతో వైఎస్ జగన్ చర్చించిన అంశాలివే..

1. తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 6 వేల 627.86 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే సెటిల్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
 
2. 2014-15 పెండింగ్ బిల్లులు, పదవ వేతన సంఘం బకాయిలు, డిస్కం ఆర్ధిక పునర్ వ్యవస్థీకరణ, వృద్ధాప్య రైతు రుణమాఫీ రూపంలో ప్రభుత్వానికి రావల్సిన 32 వేల 625 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి

3. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు 55 వేల 548.87 కోట్లను ఖరారు చేయాల్సిందిగా ప్రధాని మోదీకు విజ్ఞప్తి. డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ ప్రాజెక్టును పోలవరంలో అంతర్భాగంగా చూడాలని..జాతీయ హోదా ప్రాజెక్టుల విషయంలో ఇదే జరిగిందని విజ్ఞప్తి.

4. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా, సజావుగా జరిగేందుకు ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి భాగంలో అడ్వాన్స్ ఇవ్వాలని..80 శాతం పనులు పూర్తయిన తరువాత మిగిలిన నిధులు ఇవ్వాలని కోరిన వైఎస్ జగన్

5. రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల ప్రకారం 26 మెడికల్ వైద్య కళాశాలలు అవసరం. ఇప్పటికే 11 మెడికల్ కళాశాలుండగా..మరో మూడింటికి కేంద్రం అనుమతి లభ్యం. మిగిలిన 12 మెడికల్ కళాశాలలకు అనుమతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

6. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు గతంలో ఇచ్చిన క్లియరెన్స్ గడువు ముగిసిందని..తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి.

7. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి హామీ ఇచ్చారని..వాణిజ్యపరంగా ప్లాంట్ నిర్వహణకు ఏపీఎండీసీకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి

8. ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని..ఈ రంగంలో దాదాపు 20 వేల కోట్లు పెట్టుబడులకు అవకాశాలున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. 16 చోట్ల బీచ్ శాండ్ మినరల్స్ ప్రతిపాదనలు అందించామని...14 చోట్ల అనుమతులు పెండింగులో ఉన్నాయని తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Also read: Amma Vodi, Vahana Mitra Schemes: ఏపీలో అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అవుతున్నాయా ? ఇందులో నిజమెంత ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News