Ys Jagan Strategy: ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశముంది. ఏపీలో అధికారంలో రావాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే కీలకం. అందుకే ఈ జిల్లాలపై పట్టు కోసం అటు టీడీపీ-జనసేన, ఇటు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ-జనసేన వ్యూహానికి జగన్ కౌంటర్ స్ట్రాటెజీ అమలు చేస్తున్నారు.
ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ఏకంగా 34 నియోజకవర్గాలున్నాయి. ఐదు లోక్‌సభ స్థానాలున్నాయి. అధికారంలో రావాలంటే ఈ జిల్లాల్లో పట్టు చాలా ముఖ్యం. ఈ జిల్లాల్లో కాపు సామాజిక ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అందుకే ఆ సామాజిక వర్గం ఓట్లను చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం-జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు సామాజికవర్గం ఓట్లలో మెజార్టీ ఓట్లు కచ్చితంగా జనసేన-టీడీపీకే దక్కనున్నాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే వైఎస్ జగన్ కొత్త వ్యూహం అవలంభిస్తున్నారు. ఈ రెండు జిల్లాలో కాపులతో పాటు అత్యధికంగా ఉన్న ఓటు బ్యాంకు బీసీలు. అందుకే అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుంటూ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజమండ్రి, ఏలూరు సీట్లను ఇప్పటికే బీసీలకు కేటాయించగా అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. కాకినాడ కాపులకు, నర్శాపురం క్షత్రియ వర్గానికి కేటాయించనున్నారు.
ఇక మెజార్టీ ఎమ్మెల్యే స్థానాల్ని బీసీలకు ఇచ్చేలా వ్యూహం రచిస్తున్నారు. టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటులపై కన్నేశారు. అక్కడు తలెత్తే వ్యతిరేకతల్ని తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. భీమిలి సభతో ఎన్నికల శంఖారావం ప్రకటించిన వైఎస్ జగన్..ఫిబ్రవరి 3న ఏలూరు సభకు సిద్ధమౌతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 34 నియోజకవర్గాల్నించి జనం హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధమౌతోంది.
ఇక మూడవ సభను రాయలసీమ కేంద్రంగా అనంతపురంలో నిర్వహించనున్నారు. సీమకు చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఇప్పట్నించే ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook