Tirumala: తిరుమలలో భక్తుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అటు ప్రభుత్వం ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భక్తుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై ఆ ఐదింటినీ ప్రభుత్వం పర్యవేక్షించనుంది. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
తిరుమలలో లక్షలాదిమందికి ప్రధాన నీటి వనరుగా ఉన్న శేషాచలం కొండల్లోని 5 డ్యామ్‌లపై ఏపీ ప్రభుత్వ దృష్టి పెట్టింది. పెరుగుతున్న భక్తుల సంఖ్య, అవసరాలు, భవిష్యత్ , డ్యామ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకు ఇకపై తిరుమలలోని 5 డ్యామ్‌లు ప్రభుత్వం తన పరిధిలో తీసుకుంది. తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార అనేవి ప్రధాన డ్యామ్‌లు. ఇవే ఇక్కడ ప్రధాన నీటి వనరులు. చాలాకాలంగా ఇవి టీటీడీ నిర్వహణలో ఉన్నాయి. ఇకపై ఇవి ఏపీ ప్రభుత్వ పరిధిలో అంటే జల వనరుల శాఖకు బదిలీ అవుతున్నాయి.
కేంద్ర జలసంఘం ఆదేశాల మేరకు ఈ 5 డ్యామ్‌ల భద్రత, నీటి సామర్ధ్యం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కేంద్ర జలసంఘం అధికారి ఈ సూచనలు చేశారు. జాతీయ డ్యామ్ భద్రత కమిటీ ఈ ఐదు డ్యామ్‌లను జాతీయ రిజిస్టర్‌లో నమోదు చేయడంతో ఇకపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కేంద్ర జలసంఘానికి ఇస్తుండాలి. ఇకపై ఈ డ్యామ్‌ల పర్యవేక్షణ, నిర్వహణ అంతా ఏపీ ప్రభుత్వం చూసుకోనుంది.
Also read: AP Heavy Rains: ఏపీకు బిగ్ అలర్ట్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.