Ap governor biswabhusan harichandan Couple Visits Vijayawada Durga Temple: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan harichandan) దంపతులు గురువారం ఉదయం ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (Durga Devi) అలంకారంలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానికి ముందే గవర్నర్ నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
అలాగే దసరా (Dussehra) ఉత్సవాల్లో మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ హరిచందన్ తెలిపారు. ఏపీతో పాటు దేశం అభివృద్ధి చెందాలని... కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని తాను అమ్మవారిని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు.
Governor Shri Biswa Busan Harichandan conveyed his greetings to the people of Andhra Pradesh on the occasion of beginning of #Navaratri2021 festival, celebrated with prayers offered to Mother Goddess Durga, in all her manifestations. pic.twitter.com/nznOUtMnuy
— Governor of Andhra Pradesh (@governorap) October 7, 2021
ఇక మూలానక్షత్రమైన ఈ నెల 12న కనకదుర్గ అమ్మవారికి ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందురోజున వన్‌టౌన్ పోలీసులు (police) అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తర్వాత రోజుల్లో నగర పోలీసు కమిషనర్ సమర్పించేవారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనర్ (సీపీ) బత్తిన శ్రీనివాసులు (bathina srinivasulu0 కుటుంబసమేతంగా ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు.
Also Read : Baby onboard: విమానంలోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం, లండన్ నుంచి కేరళ వస్తున్న విమానంలో ఘటన
నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజు గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకులు సుప్రభాతసేవతో అమ్మవారిని మేల్కొలిపి, శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనలు చేశారు. మొదటి రోజు ఉదయం 9 గంటల (Morning 9) నుంచే భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది. రేపటి నుంచి తెల్లవారుజామున 4 (Early Morning )గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. అమ్మవారి దర్శనానికి రోజుకు 10 వేలమందికి (10 thousand) మాత్రమే అనుమతి ఇస్తున్నారు. 4 వేలమందికి ఉచితంగా, 3 వేలమంది వంతున రూ.100, రూ.300 టికెట్లతో దర్శనం కల్పిస్తున్నారు.
ఆన్లైన్ టికెట్ (online ticket) లేకుండా వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు దర్శనం టికెట్లు విక్రయించేందుకు వీఎంసీ కార్యాలయం ఎదుట, పున్నమిఘాట్ వద్ద దుర్గగుడి టోల్గేట్, ఓం టర్నింగ్‌ల వద్ద కరెంటు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనల రీత్యా అన్నదానాన్ని ఆపేశారు. దానికి బదులుగా ఉదయం 5 గంటల నుంచి 11 వరకు బెల్లం పొంగలి, (pongali) 11 నుంచి సాయంత్రం 4 వరకు సాంబార్ రైస్, పెరుగు అన్నం ప్యాకెట్లు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు బెల్లం పొంగలి భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇక దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని (vijayawada kanaka durga ammavaru) శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా (durga devi) దర్శించుకోవడంతో సకల దారిద్యాలు తొలిగిపోయి సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం.
Also Read : Dussehra: దసరాకు 4 వేల ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు కాస్త అదనం, అందుకు కారణం అదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook