నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని నెరవాడ గ్రామంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పర్యటించనున్నారు. గ్రామంలోని గురుకుల పాఠశాలలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు.
Pawan Kalyan - Governor : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను కలవనున్నారు. వైజాగ్ ఘటన, జన సేన కార్యకర్తల అరెస్టుల మీద ఫిర్యాదు చేసేందుకు కలవనున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, హైకోర్టు సీజే, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Andhra Pradesh Formation Day: పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) సంక్షేమం, అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan harichandan) దంపతులు గురువారం ఉదయం ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (Durga Devi) అలంకారంలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానికి ముందే గవర్నర్ నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
Arup Kumar Goswami To Take Oath As AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి ఉదయం 10 గంటలకు ఏకే గోస్వామి చేత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు.
ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను సోమవారం రాజ్‌భవన్‌లో కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను గవర్నర్‌కు ఈసీ వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.