AP Government: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు నేపధ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు ముందు ఊహించిందేనని..కొత్తదం లేదన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉందని..త్వరలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై స్పందించారు.
ఏపీ హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చించిన తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు. కోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తరువాతే అన్ని విషయాల్ని వెల్లడిస్తామన్నారు. రాజ్యంగపరంగా చట్టపరిధిలో చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయని..చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ లేదంటే ఎలా అని ప్రశ్నించారు. అయితే హైకోర్టు తీర్పులో అలా ఉండదనే అనుకుంటున్నానన్నారు. మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసివ్వాలంటే ఎలా సాధ్యమని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఏదైనా సరే ప్రాక్టికల్‌గా ఆలోచించాలని చెప్పారు. ప్రభుత్వం మాత్రం పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేసేందుకే సిద్ధంగా ఉందన్నారు.
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలన్నట్టుగా ఇప్పటికే పలు అంశాలు ప్రచారంలో ఉన్నాయి. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకు లేదని..సీఆర్డీఏ చట్టం చెప్పినట్టు నడుచుకోవాలని హైకోర్టు తీర్పులో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే..మరి సీఆర్డీఏ చట్టం కూడా అసెంబ్లీ చేసిందే కదా..అనే వాదన విన్పిస్తోంది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకు లేనప్పుడు..గత ప్రభుత్వం ఇదే రాజధానిపై చేసిన చట్టం ఎలా వర్తిస్తుందంటూ మరో వాదన విన్పిస్తోంది.
Also read: AP High Court: రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష, సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook