AP New Districts: జిల్లా కేంద్రం అక్కడే ఉండాలంటోన్న బాలకృష్ణ

Balakrishna Demands Hindupur District : ఏపీలో కొత్త‌ జిల్లాలు ఏర్పాటును స్వాగతించిన బాలకృష్ణ.. ప్ర‌తి పార్ల‌మెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందిందని.. అక్కడే జిల్లాను ఏర్పాటు చేయాల‌న్నాడు బాలయ్య .

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 05:42 PM IST
  • ఏపీలో త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటు
  • మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు
  • హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని కోరిన బాలయ్య
AP New Districts: జిల్లా కేంద్రం అక్కడే ఉండాలంటోన్న బాలకృష్ణ

AP New Districts, Balakrishna demand: ఏపీలో త్వరలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి నోటిఫికేష‌న్ కూడా వచ్చింది. ఏపీలో కొత్త‌గా మొత్తం 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. అయితే విస్తీర్ణంలో దేశంలోనే ఏడో అతి పెద్ద జిల్లాగా రికార్డుకెక్కిన అనంతపురం జిల్లా.. రెండు జిల్లాలు కానుంది. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు కానుంది.

ఇక అనంతపురం జిల్లా పరిధిలోకి 8 నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లా పరిధిలోకి ఆరు నియోజకవర్గాలు వస్తాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ (Balakrishna) స్పందించారు.

ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణకు ఏపీలో కొత్త‌గా 13 జిల్లాలు ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని బాల‌కృష్ణ‌ స్వాగతించారు. అయితే ఇచ్చిన హామీ మేరకు, ప్ర‌తి పార్ల‌మెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని బాలకృష్ణ కోరారు. హిందూపురం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందిందన్నారు. అందువల్ల హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను (District) ఏర్పాటు చేయాల‌ంటూ బాలకృష్ణ కోరారు.

Also Read: Akhanda Dubbed Release Date: మరో నాలుగు భాషల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన అఖండ మూవీ

హిందూపురంలో భూమి పుష్క‌లంగా ఉంద‌ని, ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటుకు ఎలాంటి డోకా ఉండదన్నారు. అలాగే జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్ద‌ంటూ బాలకృష్ణ కోరారు.. హిందూపురం వాసుల మ‌నోభావాల‌ను గౌర‌వించి, వారి చిరికాల కోరికను తీర్చాలన్నారు. హిందూపురం (Hindupur) ప‌ట్ట‌ణాన్ని కచ్చితంగా జిల్లా (District) కేంద్రంగా ఏర్పాటు చేయాల‌న్నారు.

Also Read: Minister Niranjan Reddy: రెండోసారి కరోనా బారినపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News