Pavan Kalayan: మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది.. మంత్రిగా నాగబాబు ప్రమాణానికి మరో నాలుగైదు నెలలు సమయం పట్టే చాన్స్ ఉందని సమాచారం. మొదట నాగబాబును ఎమ్మెల్సీని చేశాకే.. మంత్రి పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ భావిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే.. సొంత పార్టీలోనే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ముందు ఎమ్మెల్సీ బాధ్యతలు ఇచ్చినా తర్వాత.. మంత్రిని చెద్దామని డిసైడ్ అయ్యినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో చోటు కోసం చాలా మంది లీడర్లు ఆశపడ్డారు. కానీ ఊహించని రీతిలో నాగబాబు మంత్రి పదవిని కొట్టేశారని తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు. కనీసం ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కాదు.. కానీ మంత్రి పదవిని ఎలా ఇస్తారని నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయం ఆనోట ఈ నోట చంద్రబాబు దగ్గరకు చేరడంతో సీఎం చంద్రబాబు వెనక్కి తగ్గినట్టు సమాచారం. మరోవైపు తమకు ఒకే మంత్రి పదవి దక్కడంతో బీజేపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. 21 సీట్లు ఉన్న జనసేన పార్టీకి 5 మంత్రి పదవులు ఇస్తే.. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినా తమకు ఒకే ఒక్క మంత్రి పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారట.. తాజాగా ఇదే విషయాన్ని విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బహిరంగగానే విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా లేవు.. ఇటీవల వైసీపీకి చెందని నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించలేదు.. దాంతో ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ఇవి కాకుండా వచ్చే ఏడాది మార్చిలో మరో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ పోస్టుల కోసం తెలుగుదేశం పార్టీలో చాలా మంది లీడర్లు కర్చీప్‌లు వేసుకుని కూర్చున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు, గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని నేతలు.. ఎమ్మెల్సీ పదవులు వస్తాయని ఆశపడుతున్నారు. దాంతో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇదే కోటాలో నాగబాబుకు కూడా ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంది.. అయితే ఈ కసరత్తు అంతా ఏఫ్రిల్ వరకు అయ్యే అవకాశం ఉందని.. ఆ తర్వాతే నాగబాబు ప్రమాణ స్వీకారం ఉండొచ్చని చెబుతున్నారు..
Also Read: KCR Wishes: క్రీస్తు శాంతి మార్గం అద్భుతం.. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
Also Read: Allu Arjun Police Station: పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. ప్రశ్నలతో బన్ని ఉక్కిరి బిక్కిరి..