ఆ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

పాలనలో సంస్కరణలు తీసుకొస్తున్న వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం నేటి నుంచి అమలులోకి రానుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామ వాలంటీర్లకు బయోమెట్రిక్ హజరు తప్పనిసరి చేశారు.

Updated: Feb 10, 2020, 01:27 PM IST
ఆ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు నేటి (సోమవారం) నుంచి బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇదివరకే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై ఏపీ సచివాలయ ఉద్యోగులు సమయానికి తమ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రజలకు వారు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఏపీ సర్కార్ ఈ చర్యలు చేపట్టింది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు ప్రతిరోజూ బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు.

Also Read: తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన వైఎస్ జగన్

ఈ బయో మెట్రిక్ హాజరు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి లాగిన్‌ నుంచి బయోమెట్రిక్‌ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తమ ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు విధులకు హాజరైనట్లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకుని, విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో  సాయంత్రం 5.30 గంటలకు రెండోసారి బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి. లేని పక్షంలో జీతంలో కోత విధించడంతో పాటు ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఇచ్చే ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Also Read: దేశంలో తొలిసారిగా.. ‘దిశ’ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..