Chandrababu Challenge: అక్కడ గెలువ్ చూద్దాం.. జగన్‌కు చంద్రబాబు బస్తీ మే సవాల్

Chandrababu Challenges Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బస్తీ మే సవాల్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంత సంచలనం సృష్టిస్తే... సీఎం జగన్ ఎందుకు అతడిపై చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

Written by - Pavan | Last Updated : Aug 25, 2022, 12:04 AM IST
Chandrababu Challenge: అక్కడ గెలువ్ చూద్దాం.. జగన్‌కు చంద్రబాబు బస్తీ మే సవాల్

Chandrababu Challenges Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బస్తీ మే సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంను హస్తగతం చేసుకుంటామని వైఎస్ జగన్ చెబుతున్నారు కానీ.. ముందుగా నీ పులివెందులలో గెలువు చూద్దాం అంటూ జగన్‌కు చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరారు. నేడు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సీఎం వైఎస్ జగన్‌పై పలు సంచలన ఆరోపణలు చేశారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు వేరే పార్టీ వాళ్లు అటువైపు కూడా వెళ్లరు. కానీ అధికార పార్టీ వారు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కుప్పంలో నా పర్యటనకు అవాంతరాలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. 

గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోను వదలని చంద్రబాబు .. 
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంత సంచలనం సృష్టిస్తే... సీఎం జగన్ ఎందుకు అతడిపై చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునే ధైర్యం లేకే జగన్ భయపడినట్లు అనిపిస్తుందన్నారు. 

మూడున్నర ఏళ్లుగా ఒక్క ఉద్యోగం లేదు..
ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చంద్రబాబు ద్వజమెత్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టలంటేనే ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షేమం ఉండదు అని జనంలోకి ఒక తప్పుడు ప్రచారం తీసుకెళ్తున్నారు. కానీ టీడీపీ ఇలా ఎప్పుడూ అప్పులు చెయ్యలేదుదని... ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చేసి చూపిస్తాం, సంక్షేమ ఫలాలు అందిస్తాం అని చంద్రబాబు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News