సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వాయిదా

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వాయిదా

Updated: Oct 11, 2019, 04:30 PM IST
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వాయిదా

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భేటీ వాయిదా పడింది. నిన్న ఏపీ సీఎంవో నుంచి అధికారవర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం చిరంజీవికి నేడు శుక్రవారం ఉదయం 11గంటలకు జగన్ అపాయిట్‌మెంట్ లభించింది. దీంతో వీరిద్దరి భేటిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉండింది. కానీ అనూహ్యంగా కొన్ని అనివార్య కారణాల వీళ్లిద్దరి సమావేశం అక్టోబర్ 14వ తేదీకి వాయిదా పడినట్టు తెలుస్తోంది. జగన్ సీఎం అయ్యాక ఈ ఇద్దరూ తొలిసారి కలవనుండటంతో ఈ భేటీపై అటు రాజకీయంగా ఇటు సినీవర్గాల్లోనూ ఆసక్తి ఏర్పడింది. 

చిరంజీవి తాను నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహా రెడ్డి సినిమాను వీక్షించేందుకు సీఎం జగన్‌ను ఆహ్వానించడంతోపాటు దేశ భక్తిని పెంచే తమ సినిమాకు వినోదం పన్ను మినహాయించాల్సిందిగా కోరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.