CM Jagan Speech At At Volunteers Vandhanam Programme: ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు వాలంటీర్లు అని అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అవ్వాతాతకు మంచి మనవడిగా, మనవరాలిగా, ప్రతి వితంతువుకు, వికలాంగుడికి చెల్లెమ్మ-అక్కలా, తమ్ముడు-అన్నలా ప్రతినెలా ఒకటో తారీఖున అక్షరాల 64 లక్షల మందికి ప్రభుత్వ పెన్షన్ అందిస్తున్నారని అభినందించారు. దాదాపు 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిచేస్తున్నారని.. కులం, మతం, వర్గం, రాజకీయపార్టీలు చూడకుండా అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుని పథకాలు అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జగనన్న పెట్టుకున్న నమ్మకం వాలంటీర్లని అన్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
'దేశంలో ఎక్కడకు వెళ్లి చూసినా.. మునుపెన్నడూ చూడని విధంగా ప్రజలకు వాలంటీర్ల ద్వారా మేలు జరుగుతోంది. ఇలాంటి సారథులు, వారధులు దేశంలో ఎక్కడా లేరు. మంచి మనసుతో అనేక మార్పులు తీసుకు వస్తున్నాం. అనేక మార్పులకు సాక్ష్యాలు కూడా వాలంటీర్లే. రాష్ట్రంలో 90 శాతం గడపలకు వెళ్లి.. జగనన్న పాలనలో మాదిరిగా ఇలా మీ ఇంటికి వచ్చి ఒకటోతేదీనే పెన్షన్ ఇస్తాఉన్న ఇలాంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా..? అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్లపట్టాలు, రైతు భరోసా.. ఇలా అందించడాన్ని గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా..?' అని సీఎం జగన్ అన్నారు.
25 పథకాలకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లు అని అన్నారు. గతంలో ఎప్పుడూ మంచిచేయని చరిత్ర ఉన్నవారు దుష్ప్రచారాలు చేస్తున్నారని.. ఎల్లోమీడియా, సోషల్ మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ప్రభుత్వం మీద గిట్టని వారు తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. 5 కోట్ల ప్రజల ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారథులు మీరేనంటూ వాలంటీర్లను ఉద్దేశించి అన్నారు.
వాలంటీర్లుగా పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారని.. స్వచ్ఛందంగా మంచి చేయాలనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులని అభినందరించారు ముఖ్యమంత్రి. వాలంటీర్లను ఉద్దేశించి తాను చేప్పిన మొదటి మాటలను గుర్తుతెచ్చుకోవాలని.. లీడర్లుగా చేస్తానని చెప్పానని ఆ మాటను గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.
చంద్రబాబు నాయుడికు, ఎల్లోమీడియాకు వాలంటీర్ వ్యవస్థ అంటే కడుపులో మంట అని.. డజన్ జెల్యుసిల్ మాత్రలు వేసినా కూడా తగ్గని మంట ఉందన్నారు. వాలంటీర్ల మీద నిరంతరం దుష్ప్రచారం, విమర్శలు చేస్తూనే ఉన్నారని.. అసలు వీళ్లు మనుషులేనా అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు వాలంటీర్లను ఏం అన్నారో బాగా గుర్తుపెట్టుకోవాలన్నారు. జగనన్న సైన్యం వాలంటీర్లని అని.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలని పిలుపునిచ్చారు.
Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?
Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి