Covid19 Tests: కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి కోవిడ్ పరీక్షలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తోంది.
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఏపీలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతిరోజూ భారీగా పరీక్షలు చేస్తూ వస్తోంది. ఫలితంగా రాష్టంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. గత 24 గంటల్లో చేసిన 21 వేల 360 పరీక్షలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 4 వేల 569 పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం ట్రేస్, టెస్ట్, ట్రీట్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కరోనా పాజిటివ్ కేసు నమోదైన వెంటనే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసి ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 117 కరోనా పాజిటివ్ కేసులు(Ap Coronavirus Update)నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 70 వేల 95కు చేరుకుంది. గత 24 గంటల్లో 241 మంది కోలుకోగా..ఇప్పటి వరకూ రాష్ట్రంలో 20 లక్షల 52 వేల 718 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14 వేల 416 మంది కోవిడ్ కారణంగా మరణించారు.
Also read: AP Three Capital Issue: కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకుంటారా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Covid 19 Tests: రాష్ట్రంలో మూడు కోట్లు దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు