ఢిల్లీలో ఆంధ్ర భవన్ అధికారికి కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 3లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 

Last Updated : Jun 7, 2020, 10:34 PM IST
ఢిల్లీలో ఆంధ్ర భవన్ అధికారికి కరోనా పాజిటివ్..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 3లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రమానుగతంగా కీలక మార్గదర్శకాలు నిర్ణయించిన తరుణంలో కరోనా మరింత విజృంభణ జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. తాజాగా శనివారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చెందిన అధికారులకు కరోనా సోకగా ఇప్పుడు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని అధికారికి కరోనా సోకింది. కరోనా కల్లోలం.. ఏపీలో తాజాగా ఇద్దరు మృతి

Also Read: భగ్గుమన్న పెట్రో, డీజిల్ ధరలు..     

దీంతో వెంటనే ఆ అధికారిని ఢిల్లీలోని కంటోన్మెంట్‌ల ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఏపీ భవన్‌లోని ఆంధ్రా, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలను సీల్ చేశారు. శానిటైజేషన్ చేసి రెండు రోజుల తర్వాత కొనసాగించాలని అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా ఢిల్లీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులు కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్ ను నిరాకరించడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న తరుణంలో ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News