new year gift for Apsrtc employees: ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు న్యూ ఇయర్ గిఫ్ట్

కొత్త ఏడాది సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మరో వాగ్దానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చారు. కొత్త ఏడాదికి ఒక రోజు ముందుగానే ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించారు.

Last Updated : Dec 31, 2019, 02:34 PM IST
new year gift for Apsrtc employees:  ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు న్యూ ఇయర్ గిఫ్ట్

కొత్త ఏడాది సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మరో వాగ్దానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చారు. కొత్త ఏడాదికి ఒక రోజు ముందుగానే ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించారు.

ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి 
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ.. APSRTCని ప్రజా రవాణా శాఖలో విలీనం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులుగా ఉన్న వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఈ ఉత్తర్వులు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. అంటే రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారన్నమాట.  ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీలో దాదాపు 52 వేల మంది కార్మికులు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ  ప్రభుత్వ  ఉద్యోగులుగా గుర్తిస్తారు. 

ప్రజా రవాణా శాఖ ఏర్పాటు 

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే.. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్లను అందించేందుకు దాదాపు 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్‌ను నియమించింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన వర్కింగ్ గ్రూప్ ఓ సమగ్ర నివేదికను అందించింది. ముఖ్యంగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు, పోస్టుల రూపకల్పన, ఉద్యోగుల డిజిగ్నేషన్ల ఏర్పాటు, జీతాలు, పే- స్కేల్ లాంటి అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తాజాగా ప్రజా రవాణా శాఖను కొత్తగా ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా నోటిఫై చేస్తారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News