Heavy Rains: అతి భారీ వర్ష సూచన.. స్కూళ్లకు సెలవు..

Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళ ఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం వాయుగుండంగా బలపడి 7 కిలో మీటరల్ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రేపు స్కూళ్లకు  సెలవు ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 9, 2024, 10:58 AM IST
Heavy Rains: అతి భారీ వర్ష సూచన.. స్కూళ్లకు సెలవు..

Heavy Rains: గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఖమ్మంలో మున్నేరు, విజయవాడలో బుడమేరు వాగు పొంగడంతో లోతట్టు ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. మొత్తంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో వాయుగుండంగా బలపడి 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా నెమ్మదిగా కదులుతుంది. ప్రస్తుతం కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, పూరీకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 350 కిలోమీటర్లు దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అనంతరం ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ మీదుగా ప్రయాణిస్తూ బలహీన పడనుందని వెల్లడించారు.

వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాఉన్నాయి. కోస్తాంధ్రలో మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నారు. అంతేకాదు తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరం అల్లకల్లోలంగా మారింది. కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ  వర్షాల దృష్ట్యా అధికారుల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News