Janasena-Tdp: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వెలుడనుందనే వార్తల నేపధ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం రెండూ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో సెగ మొదలైంది. జనసేనతో పొత్తు కారణంగా టీడీపీకు ఇబ్బంది ఇంకాస్త ఎక్కువైంది.
ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు ఖాయమైంది. ఇంకా సీట్ల విషయంలో స్పష్టత రావల్సి ఉంది. జనసేనకు 30 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య దాదాపు అంగీకారమైనట్టు సమాచారం. ఎక్కడెక్కడ ఎవరికి కేటాయిస్తారనేది ఇంకా పూర్తిగా స్పష్టత రావల్సి ఉంది. ఈ క్రమంలో సిట్టింగులకు సీట్లు ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చినా జనసేన పొత్తు కారణంగా కొందరికి మార్పు తప్పదని తెలుస్తోంది. కొంతమంది టీటీపీ సీనియర్లను కూడా పక్కనపెట్టే అవకాశాలు లేకపోలేదు.
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది గెలిచినా ఆ తరువాత నలుగురు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇంకా 19 మంది మాత్రమే మిగిలారు. ఆ 19 మందికి మరోసారి టికెట్లు ఖాయమని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ లెక్కన రాజమండ్రి సిటీ స్థానంలో ఆదిరెడ్డి భవానీ బదులు ఆమె భర్త ఆదిరెడ్డి వాసు బరిలో దిగనున్నారు. అదే సమయంలో రాజమండ్రి రూరల్ నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితి మాత్రం సందిగ్దంగా ఉంది. ఈ స్థానం టికెట్‌ను జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆశిస్తుండటంతో పొత్తులో ఆ పార్టీకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అదే జరిగితే బుచ్చయ్యకు ఎక్కడ స్థానం కల్పిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది టీడీపీ సిట్టింగ్ స్థానం. రాజమండ్రి సిటీ తప్ప ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు ఇప్పటికే దాదాపుగా ఖరారయ్యారు. అంటే బుచ్చయ్యకు చంద్రబాబు మొండిచేయి చూపిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇక విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. కానీ ఆ స్థానాన్ని జనసేన కోరుకుంటోంది. జనసేనకు కేటాయిస్తే గంటా తిరిగి విశాఖ ఉత్తరానికి వస్తారా లేక పోటీ చేయకుండా మిగిలిపోతారా అనేది చర్చనీయాంశమౌతోంది. ఇలా రాష్ట్రంలో కొన్ని టీడీపీ సిట్టింగు స్థానాల్ని జనసేన కోరుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
మరోవైపు టికెట్ హామీతో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో నలుగురు ఎమ్మెల్యేలు చేరారు. వీరిలో నెల్లూరు రూరల్ స్థానాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ కేటాయిస్తోంది. అయితే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు సిట్టింగ్ స్థానాల్లో ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అక్కడున్న టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ తదితరుల్నించి ఇబ్బంది రావచ్చు.
Also read: CBSE Exams Schedule: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నించంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook