బీసీ కమిషన్ ఛైర్మన్ వల్లే జాప్యం జరిగింది

బిల్లుకు సంబంధించి సాక్షాత్తు బీసీ కమీషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ ఇప్పటి వరకూ ఎలాంటి సిఫారసులు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం జస్టిస్ మంజునాథ కాకుండా.. ఈ కమిషన్‌ సభ్యులుగా ఉన్న శ్రీమంతుల సత్యనారాయణ, మల్లెల పూర్ణచంద్రరావు, సుబ్రమణ్యం అభిప్రాయల మేరకే బిల్లును ప్రవేశపెట్టామని నారాయణ తెలియజేశారు.

Last Updated : Dec 3, 2017, 04:05 PM IST
బీసీ కమిషన్ ఛైర్మన్ వల్లే జాప్యం జరిగింది

బీసీ కమీషన్‌లో మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొనే కాపు రిజర్వేషన్ బిల్లును  ప్రవేశబెట్టామని ఏపీ అర్బన్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అయితే కమీషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ మొదటి నుంచీ జాప్యం చేస్తూ వచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రవేశబెట్టిన బిల్లు వల్ల ఎలాంటి చిక్కులు ఉండవని తాము భావిస్తున్నామని.. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని తాము నమ్ముతున్నామని మంత్రి తెలిపారు. అయితే ఈ బిల్లుకు సంబంధించి సాక్షాత్తు బీసీ కమీషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ ఇప్పటి వరకూ ఎలాంటి సిఫారసులు కూడా ఇవ్వలేదు.

ప్రస్తుతం జస్టిస్ మంజునాథ కాకుండా.. ఈ కమిషన్‌ సభ్యులుగా ఉన్న శ్రీమంతుల సత్యనారాయణ, మల్లెల పూర్ణచంద్రరావు, సుబ్రమణ్యం అభిప్రాయల మేరకే బిల్లును ప్రవేశపెట్టామని నారాయణ తెలియజేశారు. అయితే తాను చెప్పిన సిఫారుసులు లేని ఈ బిల్లు చెల్లదని ఇప్పటికే జస్టిస్ మంజునాథ స్పష్టం చేశారు. కమీషన్‌లో అందరూ ఆమోదిస్తేనే.. ఆ బిల్లు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. 

Trending News