అమరావాతి: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే రాజకీయ పార్టీలు ఆలోచనలు మొదలెట్టారు. ఈ క్రమంలో జనసేన పార్టీతో లెఫ్ట్ పార్టీల నేతలు భేటీ అయ్యాయి. ఈ భేటీలో జనసేన తరుపున నాదేండ్ల మనోహర్ హాజరవగా.. సీపీఎం తరుపున మధు, సీపీఐ తరుపున రామకృష్ణ పాల్గొన్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. అలాగే రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిపినట్లు తెలిసింది
ఇప్పటికే టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుండగా... ఇక వైసీపీ మరియు బీజేపీ పార్టీలు ఒంటరి పోరుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రధాన పార్టీల్లో ఇక మిగిలింది జనసేన..లెఫ్ట్ పార్టీల మాత్రమే. ఈ నేపథ్యంలో జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత భేటీతో ఈ ఊహాగాలనకు మరింత బలానిస్తున్నాయి