Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ.. అన్న ఎన్టీఆర్ కుమారుడు.. చంద్రబాబు నాయుడు బామ్మర్ధి కమ్ వియ్యంకుడు. ఒక మాజీ సీఎం కుమారుడు.. ప్రస్తుత సీఎం వియ్యంకుడు.. మాజీ కేంద్ర మంత్రి తమ్ముడు. అన్ని ఉన్నా అణిగిమణిగి ఉండటం బాలయ్య మార్క్ స్టైల్ అని సర్ధి చెప్పుకుంటున్నా.. ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంపై లోలోన కుమిలిపోతున్నారు ఆయన అభిమానులు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగు దేశం పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేసిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావిస్తున్నారు.
అంతేకాదు మూడు సార్లు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించిన బాలయ్య కు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన అభిమానులు చంద్రబాబు తీరుపై కోసంగా ఉన్నారు. బాలయ్య తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు. 2012లో జరిగిన యువగర్జన సహా పార్టీకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలతో పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తల్లో ఉత్సాహాం నింపారు. మొన్నటి ఎన్నికల్లో బస్సు యాత్ర ద్వారా పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేసిన మా బాలయ్య కి ఆమాత్య పదవి ఇవ్వకుండా దారుణంగా మోసం చేసారని ఆయన అభిమానులు వాపోతున్నారు. కానీ బాలయ్య మాత్రం తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా.. ఎందుకు ఇవ్వలేదని ఆయన అడగడు. అది బాలయ్య బలహీనత అని చెబుతున్నారు.
మొత్తంగా బావ కళ్లలో ఆనందం కోసం.. అల్లుడును ఖుషీ చేయడం కోసమే బాలయ్య ఎలాంటి మంత్రి పదవి తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. పదవి సహా దేని కోసం తాపత్రయ పడే మనస్తత్వం బాలయ్యది కాదు. ఏదైనా తన కాళ్ల దగ్గరకు రావాలని.. తాను మాత్రం పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. బాలయ్య బాబు నాకు ఇది కావాలని డిమాండ్ చెయ్యడు. అడగడు అది ఆయన బలహీనత అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
మొత్తంగా అన్నగారి టైమ్ లోనే ఎమ్మెల్యే, మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నా తీసుకోలేదు. ఏది ఏమైనా పదవులు అధికారం కావాలని కోరుకునే వ్యక్తి మా బాలయ్య కాదు అంటున్నారు. తండ్రి ఒకప్పటి ముఖ్యమంత్రి, అక్క మాజీ కేంద్ర మంత్రి, అన్న హరి కృష్ణ కూడా ఒకప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేసారు. మరోవైపు చిన బావ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మరో బావ వేంకటేశ్వరరావు మంత్రి గా పనిచేసారు. పెద్ద అల్లుడు రాష్ట్ర మంత్రి గా ఉన్నా... అధికారం ఇంట్లో ఉందనే పొగరు, అహంకారం చూపించే వ్యక్తి మా బాలయ్య కానే కాదంటున్నారు. మంత్రి పదవి రాలేదని బాలయ్యకు బాధ ఉండకపోవచ్చు అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదనే బాధలో ఉన్నారు. ఆయన్ని మంత్రిగా చూడాలనుకున్నారు. కానీ అది ఈ సారి సాధ్యం కాలేదు.
అంతేకాదు తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ లో తనయుడిగా బాలయ్యకు గౌరవం ఇవ్వడం లేదనే బాధ కూడా ఆయన అభిమానుల్లో కనిపిస్తోంది. పార్టీ బ్యానర్ లో బాలయ్య బాబు ఫోటో లేకుండా చేసారనే బాధ వాళ్లను వెంటాడుతోంది. బాలయ్య బాబు అసలు సిసలు భోళా మనిషి అని చెప్పుకుంటున్నారు. తనకు ఇది కావాలని అడిగే మనస్తత్వం బాలయ్యది కాదు. అది ఆయన బలం, బలహీనత అంటూ తమ బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కుతున్నారు.
Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter