Priest Murder: పశ్చిమ గోదావరిలో దారుణం... శివాలయంలో పూజారి దారుణ హత్య...

Priest Murder in West Godavari:ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 04:40 PM IST
  • పశ్చిమ గోదావరిలో దారుణ హత్య
  • శివాలయంలో పూజారిని హత్య చేసిన దుండగులు
  • స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోన్న హత్య
Priest Murder: పశ్చిమ గోదావరిలో దారుణం... శివాలయంలో పూజారి దారుణ హత్య...

Priest Murder in West Godavari: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. గుడి లోపలే జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. పూజారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనేది మిస్టరీగా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే... నిడదవోలు మండలం తాడిమళ్లలోని శివాలయంలో కొత్తలంక శివ నాగేశ్వరరావు (55) పూజారిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం (మార్చి 21) ఉదయాన్నే శివాలయానికి వెళ్లిన నాగేశ్వరరావు రాత్రైనా ఇంటికి తిరిగిరాలేదు. అర్ధరాత్రి అయినప్పటికీ ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

శివాలయం వద్దకు వెళ్లి చూడగా నాగేశ్వరరావు వాహనం కనిపించలేదు. దీంతో పొలం వద్దకు వెళ్లి ఉంటాడేమోనని అక్కడికి కూడా వెళ్లి చూశారు. అక్కడ కూడా లేకపోవడంతో.. పని మీద పక్క ఊరికి వెళ్లి ఉంటాడేమోనని భావించారు. మరుసటిరోజు తెల్లవారుజామున మరోసారి ఆలయం వద్దకు వెళ్లగా.. ఆలయ ప్రాంగణంలోనే నాగేశ్వరరావు రక్తపు మడుగులో పడి కనిపించాడు. దీంతో షాకైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Also read: Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!

Also Read: Delhi Crime Issue: 2 నెలల పసికందు..మైక్రోఓవెన్‌లో పెట్టి చంపేసిన ఆ ఘటిక తల్లి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News