AP Rains: ఏపీలో కుండపోత వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు, గురువారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 13, 2024, 10:49 AM IST
AP Rains: ఏపీలో కుండపోత వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Andhra Pradesh Rains: ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. శ్రీ సత్యసాయి, కడప,గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలియజేసారు. వర్షాల కారణంగా రైతులను ప్రభుత్వ అలర్ట్‌ చేసింది. దీంతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో తరలించాలన్నారు. ఉద్యానవన పంట మొక్కలు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరారు. వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు.

ప్రకాశం జిల్లాలో మంగళవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.దీంతో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. తూర్పు ప్రాంతంలో ఒకమోస్తరు వాన పడింది. జిల్లాలో ఒంగోలులో 12.8మి.మీ, కొత్తపట్నంలో 10.0 మి.మీ , జరుగుమల్లి మండలంలో 16.4మి.మీ, సింగరాయకొండలో 16 మి.మీ, వర్షపాతం నమోదైంది. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవరాల్లోని పలు మండలాల్లో తేలికపాటి వాన పడింది. మరో రెండు రోజులపాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు రైతుల్ని భయపెడుతున్నాయి. రోడ్ల పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కొంత నష్టమైనా తప్పని పరిస్థితుల్లో ధాన్యం బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు.   కొందరు అవకాశం ఉన్న మేరకు ధాన్యం అమ్మేసారు.  మరికొంత ధాన్యం రోడ్లపైనే గుట్టలుగా ఉంచారు. చిన్నవర్షానికి రైతులు బరకాలు తీసుకుని కళ్లాల దగ్గరకు వెళ్లారు.. వర్షం పెద్దది కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాని ఆరబోసిన ధాన్యంపై బరకాలు కప్పుకునేలోగా ధాన్యం తడిచిపోయింది.

వర్షం వెలిసిన తర్వాత మళ్లీ ధాన్యం ఎండబెట్టుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి మబ్బులు, మేఘాలతో వాతావరణం కనిపించింది. గంటపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ముగినిపోయాయి.  మెయిన్ రోడ్లు నీట మునిగాయి. అయితే ఖరీఫ్‌ పంటలు చేతికి అందే సమయం కావడంతో ఈ వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన రైతుల్లో ఉంది. ఈ ఏడాది వరుసగా అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రాయలసీమ జిల్లాల్లో మినహా కోస్తాంధ్ర జిల్లాల్లో సగటు కంటే అధికంగా వర్షపాతం నమోదైంది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News