schools reopen: కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఏప్రిల్ 20న మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి. పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి.
కరోనా నిబంధనలు(Covid Rules) కచ్చితంగా పాటిస్తూ 1 నుంచి 10 తరగతులు, ఇంటర్ రెండో ఏడాది వారికి తరగతులు నిర్వహించనున్నారు. పాఠశాలల్లో మాస్కు(mask), భౌతికదూరం(Social Distance), థర్మల్ స్క్రీనింగ్(Thermal screening) తప్పనిసరి చేశారు. విద్యార్థులలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే వారిని ఇళ్లకు తిరిగి పంపి వైద్య పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్ లక్షణాలున్న వారికోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు.
Also Read: AP: జగన్ సర్కారు కీలక నిర్ణయం.. ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా పిల్లలను అనుమతిస్తున్నారు. తమ తల్లిదండ్రుల(Parents) లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులు(Students) తరగతులకు హాజరు కావాలి. విద్యార్థులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలి. పాఠశాల లోపల, బయట పరిసరాల్లోనూ పూర్తిస్థాయిలో శానిటైజేషన్ అమలు చేస్తారు. పాఠశాలలు(Schools) గతంలో నిర్దేశించిన సమయాల ప్రకారమే పని చేస్తాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ స్కూళ్లకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
నేటి నుంచి పాఠశాలల్లో నూతన విద్యావిధానం(New Education Policy) అమలు చేయనున్నారు. పాఠశాల విద్యావ్యవస్థ ఆరు విభాగాలుగా మారనుంది. శాటిలైట్ ఫౌండేషన్‌కు బదులుగా పూర్వ ప్రాథమిక విద్య 1, 2.. ప్రీప్రైమరీ 1, 2 సహా ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్.. 1 నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్..3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు, 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే హైస్కూళ్లు, 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్ ప్లస్‌గా మార్చనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook