టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై టీడీపీ ఎంపీ మురళి మోహన్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో తెలుగు సినీ ప్రముఖులు కలిసి రావడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనియాంశమయ్యాయి.

Last Updated : Mar 23, 2018, 02:35 PM IST
టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై టీడీపీ ఎంపీ మురళి మోహన్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో తెలుగు సినీ ప్రముఖులు కలిసి రావడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనియాంశమయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణమురళి వంటి సినీ ప్రముఖులు.. రాజకీయ నాయకులు రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేయకుండా తెలుగు సినీ పరిశ్రమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు తమ బాధ్యతలు ఏంటో ఆ మాత్రం తెలీదా అంటూ తమ్మారెడ్డి భరద్వాజ, పోసాని రాజకీయ నాయకులకు తలంటినంత పనిచేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై స్వయంగా తెలుగుదేశం పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేతలు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల్ని సమర్థిస్తే, ఇంకొంతమంది ఆయన అభిప్రాయంతో విభేదించినట్టు తెలుగు తమ్ముళ్ల నుంచే ఓ టాక్ వినిపిస్తోంది. 

తాజాగా ఈ అంశంపై స్పందించిన ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్.. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమను తప్పు పట్టడంపై ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో వున్న మురళీ మోహన్.. రాజేంద్ర ప్రసాద్ తీరుపై టెలీ కాన్ఫరెన్స్‌లోనే సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

Trending News