Chandrababu Naidu: నాసిరకం మద్యం విక్రయిస్తూ.. ప్రజల రక్తం తాగుతున్నాడు: చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu On CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల రక్తం తాగుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. వైసీపీలో కీచకులే ఎక్కువగా ఉన్నారని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 8, 2023, 05:48 PM IST
Chandrababu Naidu: నాసిరకం మద్యం విక్రయిస్తూ.. ప్రజల రక్తం తాగుతున్నాడు: చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu On CM Jagan: మహిళల జీవితాలు మార్చేందుకే మహాశక్తి పథకం రూపొందిచామని.. అధికారంలోకి రాగానే అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలో మహిళా ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల కోసమే ‘మహాశక్తి’ కార్యక్రమం తీసుకొచ్చానని తెలిపారు. ఆడబిడ్డలు అన్నిరంగాల్లో మగవారితో సమానంగా రాణించాలని ఎన్టీఆర్ ఆలోచించి.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో కూడా వారిని ప్రోత్సహించేందుకు స్థానిక సంస్థల్లో వారికోసం 9 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని.. తాను 33 శాతానికి పెంచానని చెప్పారు.

"చట్టసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది నా కోరిక.. డిమాండ్. దానికోసం నేను ఎప్పుడూ ఆడబిడ్డలకు అండగానే ఉంటా.. అవసరమైతే పోరాడతాను. ఆడబిడ్డలు చిన్నతనం నుంచే వివక్షత ఎదుర్కొంటారు. పుట్టినప్పటినుంచి యుక్తవయస్సు వరకు తల్లిదండ్రులపై, తరువాత భర్తలపై, అనంతరం బిడ్డలపై  ఆధారపడే పరిస్థితి. చిన్నచిన్న ఖర్చులకు కూడా వారినే అడగాల్సిన పరిస్థితి. ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా బతికేశారు. అలాంటి జీవితాలను డ్వాక్రా సంఘాలతో ఉన్నతంగా తీర్చిదిద్దాను. మహిళా శక్తి ప్రభావం ఎలా ఉంటుందో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో డ్వాక్రా సంఘాలతో చేసి చూపించాను. 

వైసీపీలో కీచకులే ఎక్కువ. ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడిన ముగ్గురికి జగన్ రెడ్డి ఎంపీ సీట్లు ఇచ్చాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై 400లకు పైగా కేసులున్నాయి. వైసీపీ ప్రభుత్వం నిత్యావసరాలధరలు పెంచడంతో మహిళలు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. నిత్యావసరాలతో పాటు ఇతర అన్ని ఛార్జీలను పెంచారు. మద్యాన్ని నిషేధించకుండా నాసిరకం మద్యం విక్రయిస్తూ.. ప్రజల రక్తం తాగుతున్నాడు. మహిళలపై అత్యాచారాలు, నేరాలు, ఘోరాల్లో రాష్ట్రం దేశంలోనే ముందుంది.." అని చంద్రబాబు అన్నారు.

ఆడబిడ్డల రక్షణ అనేది ఈప్రభుత్వంలో గాల్లో దీపంగా మారిందన్నారు టీడీపీ అధ్యక్షుడు. ఆడబిడ్డలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో 76 శాతం మద్యం, ఇతర మాదకద్రవ్యాల ప్రభావంతో జరుగుతున్నవేనని అన్నారు. డ్వాక్రా, అంగన్ వాడీ సహా అన్ని విభాగాల్లోని మహిళలు ఈ ప్రభుత్వ దుర్మార్గపు, అరాచక పాలనకు బలయ్యారని మండిపడ్డారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ అనే కార్యక్రమం తీసుకొచ్చామని.. దానిలో భాగంగా మహశక్తి పథకంలో మహిళలకు అనేక స్కీమ్స్‌ ప్రకటించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పథకాల గురించి చంద్రబాబు మహిళలకు వివరించారు. రాబోయే రోజుల్లో మంచి రోజులు చూస్తారని చెప్పారు. అనంతరం మహిళలు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

Also Read: Home Guard Ravinder Death: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ దిక్కులేదు.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ  

Also Read: Aadhaar Card Update: ఆధార్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మూడు నెలలు గడువు పెంపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News