వైసిపిలో చేరిన టీడీపి సీనియర్ నేత.. జగన్‌పై ప్రశంసల జల్లు

వైసిపిలో చేరిన టీడీపి సీనియర్ నేత.. జగన్‌పై ప్రశంసల జల్లు

Updated: Sep 15, 2019, 10:30 PM IST
వైసిపిలో చేరిన టీడీపి సీనియర్ నేత.. జగన్‌పై ప్రశంసల జల్లు

అమ‌రావ‌తి: టీడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆదివారం వైసీపీలో చేరారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన తోట త్రిమూర్తులు.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఏపీ ప్రజలు సమర్థుడైన నాయకుడినే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. పార్టీలో చేరిన అనంతరం తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైసిపిలో చేరానని అన్నారు. పార్టీలోని సీనియర్లతో కలుపుకునిపోతూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. 

తోట త్రిమూర్తులుతో పాటు భారీ సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలు కూడా ఆయన వెంటే వైసీపి కండువా కప్పుకున్నారు.