Bhumana Karunakar Reddy as appointed TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో భూమన బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి పని చేసిన విషయం తెలిసిందే. ఆ అనుభవంతో ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న భూమన.. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తనను ఛైర్మన్‌గా నియమించినందుకు సీఎం జగన్‌కు భూమన కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయన ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలోనే ఆయన మార్పు తప్పదని ప్రచారం జరిగినా.. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా.. ఇటీవల మళ్లీ ఛైర్మన్ మార్పు అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్ నేతల పేర్లు కూడా వినిపించాయి. టీటీడీ ఛైర్మన్ పదవికి గౌరవ హోదా ఉండడంతో ముఖ్యమంత్రి వద్ద పెద్ద ఎత్తున లాబీయింగ్‌లు కూడా జరిగాయి. చివరికి మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతూ.. తనకు అండగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికే సీఎం జగన్ ఓటు వేశారు.
ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగానే కాకుండా.. టీటీడీ ఎక్స్‌అఫీషియా సభ్యుడిగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్‌కు అత్యంత ఆప్తులుగా ఆయనకు పేరు ఉంది. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన భూమన.. 2004-06 మధ్య తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్(తుడా) ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం రెండేళ్లపాటు టీటీడీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2009లో ప్రజారాజ్యం అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవిపై తిరుపతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భూమన ఓడిపోయారు.
వైఎస్ఆర్ మరణాంతరం జగన్ వెంట నడించారు. వైసీపీ స్థాపించిన దగ్గర నుంచి అండగా నిలిచారు. 2012లో జరిగిన తిరుపతి బై ఎలక్షన్స్‌లో వైసీపీ నుంచి తొలిసారి తిరుపతి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణపై కేవలం 708 ఓట్ల తేడాతో విజయం సాధించి.. రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Also Read: How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి
Also Read: Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి