Union Minister Nitin Gadkari launch 31 New projects in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 కొత్త జాతీయ రహదారులకు గురువారం (ఫిబ్రవరి 17) శంకుస్థాపన జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి జరిగిందన్నారు.
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'కొత్త జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏపీలో ఈరోజు 51 ప్రాజెక్టులకు ముందడుగు పడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఓ మైలురాయి. రాష్ట్రంలో రూ.10,400 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపడుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది' అని అన్నారు.
'విజయవాడ బెంజి సర్కిల్ వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని 2019 ఆగస్టులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి నేను విజ్ఞప్తి చేశాను. నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు వేగవంతం చేశాం. ఇప్పుడు ఫ్లైఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అసంపూర్తిగా ఉన్న తూర్పు ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్‌ను గడ్కరీ సహకారంతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. భూసేకరణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని మిగిలిన రోడ్లను కూడా రూ.10,400 కోట్లతో అభివృద్ధి చేస్తాం' అని సీఎం జగన్ తెలిపారు.
'విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులపై ఎలాంటి రాజకీయాలు లేవు. రాష్ట్రానికి అవసరమైన మరిన్ని జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్ళాం. విశాఖ పోర్టు నుంచి.. భీమిలి, భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు సముద్రతీరంలో ఆరులైన్ల రహదారి ఏర్పాటు చేసి 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానించాలని కోరుతున్నాం. విజయవాడ తూర్పు ప్రాంతంలో బైపాస్ రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్రం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల నుంచి బేస్తవారిపేట, సబ్బవరం నుంచి నర్సీపట్నం వరకు రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రధానిని కోరుతున్నాం' అని సీఎం విజ్ఞప్తి చేశారు.
Also Read: Model Fall Down: లైవ్ లో స్టేజ్ పై కుప్పకూలిపోయిన మహిళా మోడల్ - ఏం జరిగిందంటే?
Aslo Read: IND vs WI: వైడ్ ఇచ్చిన అంపైర్.. డీఆర్‌ఎస్ కోరిన రోహిత్ శర్మ! ఆ తర్వాత ఏమైందంటే? (వీడియో)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook