లేదంటే.. తెలంగాణలోలాగే ఇక్కడ కూడా టీడీపీ మిగలదు: చంద్రబాబుకు వల్లభనేని వంశీ హెచ్చరిక

ఆంధ్రా టీడీపీ భవితవ్యంపై చంద్రబాబుకు వల్లభనేని వంశీ ఘాటైన హెచ్చరిక

Updated: Nov 14, 2019, 08:54 PM IST
లేదంటే.. తెలంగాణలోలాగే ఇక్కడ కూడా టీడీపీ మిగలదు: చంద్రబాబుకు వల్లభనేని వంశీ హెచ్చరిక

విజయవాడ: తెలుగు దేశం పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలకు తర్వాత ఒక మాట చెబుతుందని వల్లభనేని వంశీ మోహన్ ఆరోపించారు. టీడీపీ తన వైఖరితో ప్రజల్లో విశ్వాసం పోగొట్టుకుంటోందని అన్నారు. పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఆయన కెరీర్‌ను పణంగా పెట్టి ప్రచారం చేస్తే... ఆ తర్వాత చంద్రబాబు ఆయన్ను దూరం పెట్టారు. ధర్మ పోరాట దీక్షలు చేయాల్సిన అవసరం లేదని వారించినా వినలేదు. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని గుర్తుచేశారు. 

Also read : చంద్రబాబు తీరుపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ సర్కార్‌ని టీడీపీ పదేపదే తప్పుపట్టడాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించిన వల్లభనేని వంశీ.. ప్రజలు మెచ్చి గెలిపించిన నాయకుడికి మద్దతివ్వల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మంచి పనులు చేస్తే వైకాపాకైనా మద్దతిస్తాం.. లేదంటే దానికీ దూరంగా ఉంటాం అని వంశీ స్పష్టంచేశారు. ఈ క్రమంలో టీడీపీ వైఖరిని తీవ్రంగా ఎండగట్టిన వల్లభనేని వంశీ మోహన్.. ఇంకా టీడీపీ ఇదే విధంగా వ్యవహరిస్తే తెలంగాణలోలాగే ఇక్కడ కూడా పార్టీ మిగలదని హెచ్చరించారు.