పవన్ కల్యాణ్‌ను నిలదీసిన విజయసాయి రెడ్డి

పవన్ కల్యాణ్ గారూ.. ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తారు ? : విజయసాయి రెడ్డి

Updated: Mar 23, 2019, 12:09 AM IST
పవన్ కల్యాణ్‌ను నిలదీసిన విజయసాయి రెడ్డి

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ''గతంలో టీడీపీకి మద్దతిచ్చిన మీరు అప్పుడు ఓట్లు చీలకుండా ఉండేందుకే పోటీ చేయడం లేదని అన్నారు. అలాగే ఈసారేమో ఓట్లు చీల్చడానికే అన్నట్టు పోటీకి దిగుతున్నారు. పవన్ కల్యాన్ గారూ.. ఎన్నిసార్లు ఇలా ఓటర్లను మోసం చేస్తారు'' అంటూ విజయసాయి రెడ్డి ట్విటర్ ఖాతా ద్వారా పవన్ కల్యాణ్‌ని నిలదీశారు.