MP Gorantla Madhav: గతంలో రేప్ కేస్.. ఇప్పుడు న్యూడ్ కాల్! వివాదాలకు కేరాఫ్ గోరంట్ల మాధవ్..

MP Gorantla Madhav: హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాజకీయాల్లో ఆయనో సంచలనం. వివాదాలకు కేరాఫ్. గతంలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్.. అనూహ్య పరిణామాల మధ్య రాజకీయ ఎంట్రీ ఇచ్చారు.

Written by - Srisailam | Last Updated : Aug 4, 2022, 11:31 AM IST
  • వివాదాలకు కేరాఫ్ ఎంపీ మాధవ్
  • గోరంట్ల మాధవ్ పై గతంలో రేప్ కేస్
  • కియా ప్రతినిధులకు బెదిరింపులు
MP Gorantla Madhav: గతంలో రేప్ కేస్.. ఇప్పుడు న్యూడ్ కాల్!  వివాదాలకు కేరాఫ్ గోరంట్ల మాధవ్..

MP Gorantla Madhav: హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాజకీయాల్లో ఆయనో సంచలనం. వివాదాలకు కేరాఫ్. గతంలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్.. అనూహ్య పరిణామాల మధ్య రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. కదరి సీఐగా ఉండగా ఆత్మానంద మ‌ఠం విషయంలో అప్పటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ఆయనకు విభేదాలు వచ్చాయి. ఆ సమయంలో జేసీతో ఢీ అంటే ఢీ అన్నారు మాధవ్. మీసం తెప్పి మరీ సవాల్ చేశారు.  ఎవ‌రినైనా స‌రే నాలుక కోస్తా అంటూ మీసం మెలేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ ఘటన తర్వాతే వైసీపీ అతన్ని పార్టీలోకి ఆహ్వానించింది. వైసీపీలో చేరిన మాధవ్ కు ఏకంగా హిందూపురం టికెట్ ఇచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి ఘనవిజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు గోరంట్ల మాధవ్. అయన ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటున్నారు. ఆయన చర్యలు, చేస్తున్న కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. ఈసారి ఏకంగా న్యూడ్ గా మహిళకు వీడియో కాల్ చేసిన  వీడియో లీక్ కావడం ఏపీలో పెను సంచలనమైంది.

ఎంపీ గోరంట్ల మాధవ్ పై గతంలో రేప్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని 2019లో టీడీపీ నేతలు వెలుగులోనికి తెచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విషయాన్ని గోరంట్ల మాధవ్ కూడా ప్రస్తావించారు. 2012 లో ఈ కేసు ఉందని అఫిడవిట్‌లో తెలిపారు గోరంట్ల మాధవ్. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలపై రేప్ కేసుల గురించి  జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాల్లో  హిందూపురం ఎంపీ విషయం కూడ ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో గోరంట్ల మాధవ్ పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఆరు నెలల క్రితం ఎంపీ గోరంట్ల మాధవ్ పై లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు చేశాడు. ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే అంతం చేస్తానని మాధవ్ హెచ్చరించారని ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఆవరణలో తన దగ్గరకు వచ్చి చేయి చూపిస్తూ చంపేస్తానని బెదిరించాడని రఘురామ రాజు ఆరోపించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. మాధవ్ బెదిరింపులపై పార్లమెంట్ లో ప్రస్తావించారు ఎంపీ రఘురామ రాజు. అయితే మాధవ్ మాత్రం తాను రఘురామ రాజును బెదిరించలేదని వివరణ ఇచ్చుకున్నారు. నియోజరవర్గంలో పర్యటించినప్పుడు గోరంట్ల మాధవ్ వ్యవహారశైలిలో ఆరోపణలు వచ్చాయి. అధికారులతో దురుసుగా వ్యవహరిస్తారనే విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నేతలపై కూడా గోరంట్ల మాధవ్ వైఖరి సరిగా ఉండగనే వార్తలు వచ్చాయి. మాధవ్ తీరుపై కొందరు వైసీపీ నేతలు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న కియా యాజమాన్యాన్ని గోరంట్ల మాధవ్ బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. కియా కారు ప్రారంభోత్సవం రోజున గోరంట్ల మాధ‌వ్‌ కియా మేనేజ్‌మెంట్ మెడ‌లు వంచుతా అంటూ కామెంట్ చేశారు. తర్వాత ఆయన కియా ప్రతినిధులపైకి చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన ఫోటోలు బయటికి వచ్చాయి. తనకు కమీషన్ ఇవ్వాలనే ఎంపీ బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే మాధవ్ మాత్రం కియా పరిశ్రమలో స్థానికులు ఉద్యోగాలు ఇవ్వాలని తాను కియా ప్రతినిధులు చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News