Ongole ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రముఖులు సైతం కోవిడ్-19 బారిన పడుతున్నారు.

Last Updated : Dec 20, 2020, 12:57 PM IST
Ongole ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా

MP Magunta Sreenivasulu Reddy tested Covid-19 positive: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రముఖులు సైతం కోవిడ్-19 బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreenivasulu Reddy) కరోనావైరస్ (Coronavirus positive) బారిన పడ్డారు. దీంతో ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. Also read: Narendra Modi: గురుతేజ్ బహదూర్‌కు ప్రధాని మోదీ నివాళి

Ongole ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ (Covid-19) టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని.. దీంతో వెంటనే ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని.. ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించింది. Also read: Covid-19: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఐసీఎంఆర్ చీఫ్‌కు కరోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News