Top 5 Upcoming CNG Cars in india: గత కొన్ని సంవత్సరాలుగా CNG కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023లో మరిన్ని మోడల్స్ లాంచ్ చేసేందుకు ఆటో సంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ సీఎన్జీ కార్లు పెట్రోల్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తాయి, ఇదే సమయంలో కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. ఎక్కువ మైలేజ్ కావాలనుకునేవారికి బెస్ట్ అప్షన్ ఈ సీఎన్జీ కార్లు. త్వరలో రాబోతున్న టాప్-4 సీఎన్జీ కార్స్ ఏంటో చూద్దాం.
మారుతీ బ్రెజ్జా సీఎన్జీ(Maruti Brezza CNG): 2023లో మారుతీ సుజుకీ ఎస్‌యూవీకి సీఎన్జీ వర్షెన్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. CNG కిట్‌తో కూడిన మారుతీ బ్రెజ్జా ఇటీవల కొన్ని డీలర్ యార్డ్‌లలో కనపించింది. ఈ ఏడాది మెుదల్లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతీ లాంచ్ చేసిన తొలి సీఎన్జీ వాహనం ఇదే అయ్యే అవకాశం ఉంది.
టయోటా హైరైడర్ సీఎన్జీ (Toyota Hyryder CNG): టయోటా తన కొత్త హైరైడర్ కాంపాక్ట్ SUVని CNG కిట్‌తో తీసుకురానున్నట్లు ఇప్పటికే ధృవీకరించింది. దీని బుకింగ్స్ కూడా మెుదలయ్యాయి. ఇది 1.5లీటర్ పెట్రోల్, మైల్డ్ హైబ్రీడ్ పవర్‌ట్రైన్ అప్షన్ తో మిడ్-స్పెక్ G, ఎస్ మోడల్స్ లో రానుంది.
మారుతి గ్రాండ్ విటారా సీఎన్జీ(Maruti Grand Vitara CNG): మారుతీ తీసుకొచ్చిన గ్రాండ్ విటారా గతంలో మంచి సక్సెస్ ను అందుకుంది. దీంతో ఎస్యూవీ యెుక్క సీఎన్జీ వర్షెన్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ(Tata Altroz CNG): CNG కార్ల రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి టాటా తన CNG లైనప్‌ని విస్తరించాలని యోచిస్తోంది. దీని కింద టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జిని తీసుకురాబోతోంది.
టాటా పంచ్ సీఎన్జీ(TATA Punch CNG): నెక్సాన్ తర్వాత టాటా మోటార్స్‌లో అత్యధికంగా అమ్ముడైన రెండో కారు టాటా పంచ్. ఇప్పుడు దీని యెుక్క సీఎన్జీ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.
Also Read: kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.