Business Ideas in Telugu: మీ గ్రామంలోనే ఉంటూ ఈ వ్యాపారాలు చేయండి.. మంచి లాభాలే లాభాలు..!

Small Business Tips: మీరు గ్రామంలోనే ఉంటూ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకు అనేక బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. పెద్ద నగరాలతో పోలిస్తే.. గ్రామాల్లో ఇన్వెస్ట్‌మెంట్ కూడా కాస్త తక్కువగా ఉంటుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2023, 06:22 PM IST
Business Ideas in Telugu: మీ గ్రామంలోనే ఉంటూ ఈ వ్యాపారాలు చేయండి.. మంచి లాభాలే లాభాలు..!

Small Business Tips: చాలా మంది ఉన్న సొంత ఊరిని వదిలి.. నగరాల్లో వచ్చి స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. ఎక్కువమంది ఉద్యోగాలు చేసుకుంటుండగా.. మరికొందరు బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. గ్రామాలు, మండలాల్లో లేదా సమీపంలోని చిన్న పట్టణాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇలా పెద్ద నగరాలకు వచ్చిన అనేక మంది సెటిల్ అవుతున్నారు. వీరిలో చాలామందికి సొంతూళ్లను వదిలిపెట్టే ఇష్టం లేకపోయినా.. బతుకుదెరువు కోసం తప్పని పరిస్థితులు నగరాల్లోనే జీవిస్తున్నారు. సొంత ఊరిలోనే ఉంటూ మీ గ్రామంలో అయినా.. లేదా సమీపంలోని మండలంలో వ్యాపారం చేసుకుంటూ జీవించవచ్చు. ఇందుకు కొన్ని బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. 

మీ కుటుంబ సభ్యులకు దగ్గరగా.. మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి ఉంటూ.. బిజినెస్ పెట్టుకోవచ్చు. ఎక్కువ అత్యాశకు పోకుండా.. సింపుల్‌గా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. గ్రామాలు లేదా చిన్న పట్టణాలలో వ్యాపారం చేయడానికి స్థలం కూడా ఈజీగా లభిస్తుంది. పెద్ద నగరాలతో పోలిస్తే.. గ్రామాల్లో పెట్టుబడి ఖర్చు, అద్దె కూడా తక్కువగా ఉంటుంది. రకరకాల వ్యాపారాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. గ్రామాలు, చిన్న పట్టణాలలో ప్రారంభించగల కొన్ని బిజినెస్‌లు ఉన్నాయి. అవేంటంటే..?

==> పాడి పరిశ్రమ: పాల వ్యాపారం ద్వారా గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఎక్కువ ఆదాయం అర్జించవచ్చు. పాడి పరిశ్రమ కాస్త ఓపికగా చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి.
==> యంత్రాల అద్దె: వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేసుకోవచ్చు.
==> భూమి ఉంటే.. పండ్లు, కూరగాయల సాగు, పూల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు.
==> కిరాణా దుకాణం: పట్టణాల్లో దొరికే వస్తువులను గ్రామాల్లో కిరణా దుకాణం వ్యాపారం అందిస్తే మంచి లాభాలు వస్తాయి.
==> ఇటీవల టీ దుకాణాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రాంతంలో టీ దుకాణం పెడితే.. మంచి ఆదాయం వస్తుంది.
==> గోబర్ గ్యాస్ ఉత్పత్తి, ఇంటర్నెట్ కేఫ్, ఆయిల్ మిల్లు, ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఇలాంటి వ్యాపారాలు కూడా ప్రారంభింవచ్చు.

Also Read: GST On Hostels: హాస్టల్స్, పీజీలో ఉంటున్న వారికి బ్యాడ్‌న్యూస్.. ఫీజుల మోత తప్పదా..?  

Also Read: Telangana Floods: రేపు తెలంగాణకు కేంద్ర అధికారుల బృందం.. వరద నష్టంపై అంచనా    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News