Gold Price Today: భారతీయులకు బంగారం ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పండుగ వచ్చినా, శుభకార్యం జరిగినా పక్కాగా పసిడిని ధరిస్తారు. చాలా మంది మధ్యతరగతి ప్రజలు భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ధర తగ్గినప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. దీపావళి నుంచి పరుగులు పెడుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు.. నాగుల చవితి రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా అక్టోబరు 29న గోల్డ్, సిల్వర్ రేట్లు నిలకడగా ఉన్నాయి. క్రితం రోజుతో పోలిస్తే ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.63,700గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదైనవని గుర్తించుకోండి.
దేశీయంగా బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,530 వద్ద కొనసాగుతోంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం రేటు రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
Also Read: Petrol For Cheap Cost: తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook