Gold price today: భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఇదే మంచి ఛాన్స్ కొనేయండి..

Gold-Silver Price Fall: పుత్తిడి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 03:11 PM IST
Gold price today: భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఇదే మంచి ఛాన్స్ కొనేయండి..

Gold Rates on 13th December 2023: గత కొన్ని రోజులగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీనికి అంతర్జాతీయంగా వస్తున్న మార్పులే కారణం. ఇజ్రాయిలె-హమస్ యుద్ధం,  డాలర్ విలువలో పెరుగుదల, ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు తదితర కారణాల వల్ల పసిడి రేటు పడిపోతూ వస్తుంది.

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,910 వద్గ కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.200 తగ్గి రూ. 56,750గా ఉంది. మెుత్తంగా నిన్నటి రేట్లతో పోలిస్తే దాదాపు రెండు వందల రూపాయల మేర తగ్గుదల కనిపించింది. మరోవైపు విశాఖపట్నం మార్కెట్లో కిలో వెండి 77,800 రూపాయలు పలుకుతోంది. ముంబయి కిలో వెండి రూ. 75, 700గా ఉంది. అయితే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

** విజయవాడలో 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర రూ. 61,910 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 56,750గా ఉంది. 
** హైదరాబాద్ లో 24క్యారెట్ గోల్డ్ ధర రూ. 61,910 ఉండగా.. 22 క్యారెట్ పసిడి ధర రూ. 56,750గా ఉంది. 
** ముంబాయిలో 24 క్యారెట్ పసిడి ధర రూ. 61,910 కాగా... 22 క్యారెట్ బంగారం ధర రూ. 56,750గా కొనసాగుతోంది. 
** బెంగళూరులో 24 క్యారెట్ బంగారం ధర రూ.61,910 ఉంటే.. 22 క్యారెట్ పసిడి రేటు రూ. 56,750గా ఉంది. 
** మరోవైపు చెన్నైలో బంగారం ధర కాస్తా ఎక్కువగా ఉంది. అక్కడ 24క్యారెట్ గోల్డ్ రేటు రూ. 62,400 కాగా.. 22 క్యారెట్ పసిడి ధర రూ.57,200గా ఉంది. 

Also Read: New Year 2024: న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ఇంతకన్నా మంచి ప్లేసెస్ ఉండవు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News