Pay Later Option in IRCTC: అర్జంట్ గా ఊరు వెళ్లాలి.. ముందుగా అనుకోని ప్రయాణం.. రైలు టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవు. దాంతో వారిని వీరిని అడగాల్సి ఉంటుంది. కొందరు మొహమాటంతో అడగలేని పరిస్థితిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారి కోసం రైల్వే శాఖ వారు పే లేటర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.
కొన్ని బ్యాంక్ లు ఇప్పటికే పే లేటర్ అంటూ అత్యవసర సమయాల్లో కొంత మొత్తంలో డబ్బును ఇచ్చి ఆ తర్వాత అకౌంట్ నుండి తీసుకుంటుంది. ఇప్పుడు అదే పద్దతిని రైల్వే శాఖ లో కూడా మొదలు పెట్టారు. చేతిలో డబ్బు లేకున్నా కూడా టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. ఆ డబ్బును తర్వాత చెల్లించే అవకాశంను రైల్వే శాఖ ఇవ్వడంతో సామాన్య ప్రయాణికులకు చాలా ఉపయోగ దాయకం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పే లేటర్ సదుపాయాన్ని రైల్వే శాఖ పేటీఎం.. క్యాష్ ఈ.. ఈ పేలేటర్ సంస్థలతో కలిసి అందించేందుకు సిద్ధం అయ్యింది. పేటీఎంతో పాటు ఆ సంస్థలు తమ వినియోగదారులకు కొంత మొత్తంలో డబ్బు ఇచ్చి నెల లోపు వడ్డీ లేకుండా తీసుకుంటూ ఉంది. ఇప్పుడు ఆ పద్దతిలోనే రైల్వే శాఖ తో జత కలిసి టికెట్ల బుకింగ్ కోసం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
రైల్వే ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకోవాలంటే డబ్బు ఉన్నా లేకున్నా పే లేటర్ సదుపాయంతో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెల లోపు ఆ డబ్బును పేటీఎం కు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ కూడా ఉండదు. ఈ సదుపాయం వల్ల టికెట్లు ఎక్కువగా అమ్ముడు పోవడంతో పాటు ఇతర సంస్థలు కూడా లాభం దక్కించుకుంటాయి అంటూ మార్కెట్ వర్గాల వారు అంటున్నారు.
Also Read: Prabhas Adipurush: అక్కడ ఆదిపురుష్ షో క్యాన్సిల్.. ఫ్యాన్స్ డిస్పాయింట్
పే లేటర్ విధానంలో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే...
ఐఆర్సీటీసీ పోర్టల్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ప్రయాణ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత టికెట్ బుక్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. పేమెంట్ పేజ్ కి వెళ్లినప్పుడు పే లేటర్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ పేటీఎం పోస్ట్ పెయిడ్ ఎంపిక చేసుకుని టికెట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేటీఎం వివరాలను అక్కడ ఇచ్చిన వెంటనే టికెట్ బుక్ అయినట్లే.
ఆ డబ్బును తిరిగి నెల రోజుల్లో చెల్లించాలని ఆలస్యం అయితే వడ్డీ పడుతుందని పేటీఎం వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి చేతిలో సింగిల్ పైసా లేకుండానే రైలు ప్రయాణం చేసే అవకాశంను కల్పిస్తున్నారు. ముందు ముందు రైల్వే శాఖ మరిన్ని సదుపాయాలతో జనాల ముందుకు వస్తుందేమో చూడాలి.
Also Read: Sharwanand Marriage : రూమర్లకు చెక్.. శర్వానంద్ పెళ్లి తేది ఖరారు.. వేదిక ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి