Post office special scheme: వృద్ధాప్యంలో ఎప్పుడూ మరొకరిపై ఆధారపడకుండా ఉంటే అంతకు మించిందేమీ ఉండదు. చాలామందికి వృద్ధాప్యమే సమస్యగా మారుతుంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బులు సురక్షితంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనికోసం పోస్టాఫీసులో గ్యారంటీ రిటర్న్ స్కీమ్స్ ఉన్నాయి.
పోస్టాఫీసులు అందించే ఈ స్కీమ్ పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పధకమిది. ఈ పధకంలో ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్ లభిస్తాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే అధికంగా లబ్ది పొందుతారు. ఈ స్కీమ్‌లో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఇది మారుతుంటుంది. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 60 ఏళ్లు దాటినవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో వీఆర్ఎస్ తీసుకున్నవారికి కూడా ప్రయోజనం కల్గిస్తుంది. ప్రస్తుతానికి ఈ పధకంపై 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ లెక్కన సీనియర్ సిటిజన్లకు ప్రతి మూడు నెలలకు 10, 250 రూపాయలు అందుతాయి. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మూడు నెలలకు 10 వేలకు పైగా వడ్డీ పొందవచ్చు. అంటే ఐదేళ్లలో వడ్డీ రూపంలో 2 లక్షలు ఆర్జించవచ్చు. ఈ పధకం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐదేళ్ల కాల వ్యవధికి 5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వడ్డీ 8.2 శాతం ఉంటుంది. మెచ్యూరిటీ తరువాత 7,05000 అందుతుంది. అంటే వడ్డీ రూపంలో లభించేది 2 లక్షల 5 వేల రూపాయలు. మూడు నెలలకు వడ్డీ 10 వేల 250 రూపాయలు అందుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం కావడంతో ఎలాంటి రిస్క్ ఉండదు. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పధకంగా చెప్పవచ్చు. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఈ స్కీమ్‌ను దేశంలో ఎక్కడికైనా సరే బదిలీ చేసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తుంటారు.
మీకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు లేదా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఓపెన్ చేయవచ్చు. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడీ కార్డు, కేవేసీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వడ్డీ నేరుగా మీ బ్యాంకు ఎక్కౌంట్‌లో ప్రతి మూడు నెలలకు క్రెడిట్ అవుతుంది.
Also read: New Rules Change: డిసెంబరు 1వ తేదీ నుంచి కీలక మార్పులు..G mail ఖాతాదారులకు భారీ షాక్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook