Ration Card Aadhar Link: మీరు ఇంకా మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకుంటే.. వెంటనే ఆ పనిచేయండి. గతంలో రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు అవకాశం ఇవ్వగా.. ఆ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇదే విషయాన్ని ఓ అధికారిక ప్రకటన ద్వారా ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెలియజేసింది. అయితే రేషన్ కార్డుతో ఆధార్ ను లింక్ చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డును లింక్ చేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
రేషన్ కార్డును ఆధార్ లింకింగ్ తప్పనిసరి!
రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే రేషన్ అందుతుంది. కేంద్ర ప్రభుత్వ ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకం కింద దేశంలోని లక్షలాది మంది ప్రయోజనాలు పొందుతున్నారు. రేషన్ కార్డుతో అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. మీరు రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని ఏ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ షాప్ నుండి రేషన్ పొందవచ్చు.
ఆన్లైన్లో ఆధార్ కార్డ్ లింక్ చేయడం ఎలా?
1. దీని కోసం ముందుగా మీరు ఆధార్ అధికారిక వెబ్సైట్ uidai.gov.inకి వెళ్లండి.
2. ఇప్పుడు మీరు 'Start Now' పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీరు మీ చిరునామాను జిల్లా రాష్ట్రంతో నింపండి.
4. ఇప్పుడు 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఇ-మెయిల్ చిరునామా.. మొబైల్ నంబర్ మొదలైనవాటిని పూరించండి.
6. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
7. ఇక్కడ OTPని పూరించిన తర్వాత, మీరు మీ స్క్రీన్‌పై ప్రక్రియ పూర్తయిన సందేశాన్ని పొందుతారు.
ఆఫ్‌లైన్ లింక్ ఎలా చేయాలి
ఆన్ లైన్ లోనే కాకుండా.. మీరు ఆఫ్‌లైన్‌లో కూడా రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయవచ్చు. దీని కోసం మీరు రేషన్ కార్డు హోల్డర్ ఆధార్ కార్డు కాపీ, రేషన్ కార్డు కాపీ.. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను తీసుకొని రేషన్ కార్డ్ సెంటర్లో సమర్పించాలి. మీరు రేషన్ కార్డ్ సెంటర్లో మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ డేటా ధృవీకరణను కూడా పొందవచ్చు.
Also Read: Knowledge Story: ఇండియన్ కరెన్సీ నోట్లపై ఉండే గీతలు ఏంటో ఎప్పుడైనా గమనించారా?
Also Read: iPhone 12 Mini Flipkart: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 వేలకే iPhone 12 Mini!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook