Skoda Epiq SUV Price: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ త్వరలోనే శుభవార్త తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేయబోతోంది. త్వరలోనే జరగబోయే వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్ 2024లో Epiq అనే SUVని పరిచయం చేయబోతున్నట్లు తెలిపింది. ఇది ఎంతో శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ వచ్చే సంవత్సరం మొదటి నెలలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ SUVకి సంబంధించిన ఫీచర్స్, ధర లీక్ అయ్యాయి. ఇది మార్కెట్‌లోకి లాంచ్ అయితే దాదాపు రూ. 22.57 లక్షలతో అందుబాటులోకి రానుంది. ఇది అత్యంత ప్రీమియం లుక్ కలిగిన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబధించిన లీక్ అయిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్ కాబోయే Skoda Epiq SUV కారు ఐరోపాలో లభించే కుప్రా రావల్ కారును పోలి ఉంటుంది. అయితే దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400కిమీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన డిజైన్ కూడా గతంలో లీక్ అయ్యాయి. దీనిని కంపెనీ స్కోడా విజన్ 7S కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేయబోతున్నట్లు లీక్ అయిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఈ స్కోడా ఎపిక్ EV ఫ్రంట్ సెటప్‌లో LED లైటింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. ఈ కారు పొడవులో 4.1 మీటర్లు, T-ఆకారపు LED DRLలను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.
ఈ కారు చూడడానికి అచ్చం జీప్ SUV లాగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, LED టెయిల్‌లైట్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు SUV కారు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో లభించనుంది. అలాగే 13-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వర్చువల్ కాక్‌పిట్ లభిస్తోంది. ఇవే కాకుండా ఎంతో శక్తివంతమైన చార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 400Km కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఇక ఈ SUV కారుకు సంబంధించిన బూట్ సామర్థ్యం విషయానికొస్తే, 500 లీటర్ల వరకు బూట్ స్పెస్‌ను కలిగి ఉంటుంది.
స్కోడా ఎపిక్ EV టాప్ 10 ఫీచర్స్:
పెద్ద బ్యాటరీ & ఎక్కువ రేంజ్: 64.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో 500 కి.మీ.లకు పైగా మైలేజీ రేంజ్‌తో లభిస్తోంది.
ఫాస్ట్ ఛార్జింగ్: 100 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 30 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.
శక్తివంతమైన మోటార్: 220 bhp శక్తి, 310 Nm టార్క్‌తో 0-100 kmphకు 8.3 సెకన్లలో చేరుకుంటుంది.
ప్రీమియం డిజైన్: స్లిక్, స్పోర్టీ డిజైన్‌తో పాటు LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లుతో అందుబాటులోకి రాబోతోంది.
క్యాబిన్ లోపల: ప్రీమియం ఫీచర్స్‌తో విశాలమైన, సౌకర్యవంతమైన క్యాబిన్ కలిగి ఉంటుంది.
పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్: 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్స్ కంట్రోల్స్.
కనెక్టెడ్ కార్ టెక్నాలజీ: స్కోడా కనెక్ట్ యాప్ ద్వారా రిమోట్ ట్రాకింగ్, ఛార్జింగ్ షెడ్యూల్ చేయడం.
సన్‌రూఫ్: పెద్ద పాన్‌రోమిక్ సన్‌రూఫ్.
అధునాతన భద్రతా ఫీచర్స్: 6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESC, TPMS, ISOFIX టెక్నాలజీ
ఆధునిక డ్రైవింగ్ అసిస్టెన్స్: క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సపోర్ట్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి