Layoffs 2023: భారీగా లేఆఫ్‌లు.. 6 నెలల్లోనే 2.12 లక్షల మంది ఉద్యోగుల తొలగింపు

Layoffs 2023 in India: ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. భారత్‌లో జూన్ 30వ తేదీ నాటికి 11 వేల మందిని వివిధ కంపెనీలు తొలగించాయి. గతేడాది కంటే 40 శాతం ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు గణంకాలు చెబుతున్నాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 3, 2023, 07:40 AM IST
Layoffs 2023: భారీగా లేఆఫ్‌లు.. 6 నెలల్లోనే 2.12 లక్షల మంది ఉద్యోగుల తొలగింపు

Layoffs 2023 in India: ఈ ఏడాది ప్రైవేట్ రంగంలో భారీగా ఉద్యోగాలకు కోత పడింది. ముఖ్యంగా టెక్ రంగంలో వరుస లేఆఫ్‌ల ప్రకటనలతో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయోనని భయం నెలకొంది. ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ నాటికి లక్షలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. గత ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.12 లక్షల మంది ఉద్యోగాలను పలు కంపెనీలు తొలగించాయి. ఇందులో భారీ టెక్ సంస్థలతోపాటు స్టార్టప్‌లు కూడా అన్ని ఉన్నాయి. 

ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్ వెబ్‌సైట్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది. ఈ వెబ్‌సైట్ ప్రకారం.. జూన్ 30 నాటికి 819 టెక్ కంపెనీల్లో 212,221 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. 2022లో సంవత్సరం మొత్తం  1046 టెక్ కంపెనీలలో 1.61 లక్షల మంది ఊడిపోగా.. ఈ ఏడాది ఆరు నెలల్లోనే 2 లక్షల మందికిపై ఉద్యోగాలు పోయాయి. గత ఏడాదిన్నర కాలంలో మొత్తం 3.8 లక్షల మంది ఉద్యోగులను వివిధ కంపెనీలు తొలగించాయి. కంపెనీ అవసరానికి మించి రిక్రూట్‌మెంట్ చేసుకోవడం.. అస్థిర ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వంటి వాటిని ఉద్యోగుల తొలగింపునకు కారణాలుగా చెబుతున్నారు.

మన దేశంలోని టెక్ రంగంలో కూడా భారీగా లేఆఫ్‌లు జరిగాయి. ఇప్పటివరకు 11 వేల మందికిపైగా ఉద్యోగులను ఇండియా స్టార్టప్‌ కంపెనీలు తొలగించాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ అని గణంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపుతో పోలిస్తే.. భారత్‌లో 5 శాతం ఉన్నాయి. 2022 సంవత్సరంలో కంపెనీలు కష్టకాలం ఎదుర్కొంటున్నప్పటి నుంచి ఇప్పటివరకు 102 భారత్ స్టార్టప్ కంపెనీ‌లలో 27 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.   

మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ Tracxn డేటా ప్రకారం.. భారతీయ స్టార్టప్‌లు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 5.48 బిలియన్ల డాలర్లను మాత్రమే సంపాదించాయి. గతేడాది ఇదే కాలంలో సేకరించిన 19.5 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఈ నిధుల కొరత కారణంగా ఆర్థికంగా గట్టెక్కేందుకు స్టార్టప్‌ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. 

Also Read: Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. 29 మంది ఎమ్మెల్యేలతో జంప్

Also Read: Karnataka Snake Video: చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచిన వ్యక్తి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News