స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తేలింది. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో పోరాడటానికి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై సుప్రీం కోర్టు న్యాయవాదులతో నారా లోకేష్ చర్చించనున్నారు.
Layoffs 2023 in India: ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. భారత్లో జూన్ 30వ తేదీ నాటికి 11 వేల మందిని వివిధ కంపెనీలు తొలగించాయి. గతేడాది కంటే 40 శాతం ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు గణంకాలు చెబుతున్నాయి.
Konaseema Update: జిల్లా పేరు వివాదంతో అట్టుడికిన కోనసీమలో ఇంకా నివురు గప్పినా నిప్పులానే ఉంది. సాధారణ పరిస్థితులే కనిపిస్తున్నా కోనసీమలో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇంకా ఇంటర్ నెట్ సేవలను పునరుద్దరించలేదు. మే24న జరిగిన అల్లర్ల తర్వాత కోనసీమలో ఇంటర్ నెట్ సేవలను తొలగించారు. అప్పటి నుంచి పునరుద్దరించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ పై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర కార్మిక శాఖ టెక్ దిగ్గజం ఇన్పోసిస్కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వెంటనే ఇన్ఫోసిస్ ప్రతినిధులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను సంప్రదించారు. కేంద్రం జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పులు జరగలేదని సమర్థించుకుంటున్నారు. అయితే ఈ చర్చల్లో ఏ నిర్ణయం వెలువడుతుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Work from home in Bengaluru: సెప్టెంబర్ నెల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తమ సిబ్బందిని వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించుకుని ఆఫీసులకు రావాల్సిందిగా సూచించనున్నట్టు తెలుస్తున్న క్రమంలో ఐటి ఉద్యోగుల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లాక్డౌన్ ఉన్నన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) చేయడం బాగుంది కానీ లాక్ డౌన్ తర్వాత పరిస్థితేంటి ? కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంట్లోంచి బయటికి వెళ్తే.. కరోనా నుంచి తప్పించుకోవడం ఎలా ? ప్రస్తుతం చాలామంది ఐటి ఉద్యోగులను వేధిస్తున్న ప్రశ్న ఇదే.
కరోనా వైరస్ను నియంత్రించేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ కారణంగా దేశంలో చాలా కంపెనీలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయని... తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయని పలు వాణిజ్య సంస్థలు, ఆర్థిక నిపుణులు గగ్గోలు పెడుతుండటం నిత్యం వార్తల్లో చూస్తున్నదే. ఈ ఆర్థిక మాంద్యాన్ని సాకుగా చూపిస్తూ సంస్థలు ఎక్కడ తమని ఉద్యోగంలోంచి తీసేస్తాయోననే ఆందోళన ఐటి నిపుణులతో పాటు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులను వేధిస్తోంది.
ఐటి ఉద్యోగులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రధాన రద్దీ ప్రాంతమైన హైటెక్ సిటీ-రాయదుర్గం మార్గంలో 1.5 కీ మీ మేర మెట్రో మార్గాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.